దారుణం : వివాహితపై 17 మంది అఘాయిత్యం | Jharkhand: 35 year old woman gang-raped by 17 men | Sakshi
Sakshi News home page

దారుణం : వివాహితపై 17 మంది అఘాయిత్యం

Dec 10 2020 11:41 AM | Updated on Dec 10 2020 2:33 PM

Jharkhand: 35 year old woman gang-raped by 17 men - Sakshi

రాంచీ:  జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహితను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.  బాధిత మహిళ మార్కెటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్ళారు. అనంతరం  ఆమెపై ఏకంగా 17మంది వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ  దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దుంకా జిల్లా ముఫాస్సిల్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, ఆమె భర్త  ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు.  బాధితురాలిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి, 17మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని దుంకా డీఐజీ సుదర్శన్ మండల్ చెప్పారు. నిందితుల్లో ఒకరిని  అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement