బిహార్‌: జేడీయూ నేత హత్య | JDU Leader Ashok yadav Shot Dead In Bihar Madhepura | Sakshi
Sakshi News home page

బిహార్‌: జేడీయూ నేత హత్య

Aug 12 2020 2:32 PM | Updated on Aug 12 2020 2:37 PM

JDU Leader Ashok yadav Shot Dead In Bihar Madhepura - Sakshi

పట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. జేడీయూ పార్టీకి చెందిన ఓ నేత మంగళవారం రాత్రి 8 గంటలకు హత్యకు గురయ్యారు. వివరాలు.. మాధేపురా జిల్లాలో ఆశోక్‌ యుదవ్‌(50) అనే జేడీయూ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. జేడీయూ గాంహరియా బ్లాక్‌ ప్రెసిడెంట్‌ ఉన్నఅశోక్‌ యాదవ్‌ తన స్వగ్రామం జోగ్బానీలో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సమయంలో ఈ హత్య ఘటన జరిగినట్లు మాధేపురా సబ్‌ డివిజన్‌ పోలీసు ఆఫీసర్‌( ఎస్‌డీపీఓ) వాషి అహ్మద్‌ తెలిపారు.

మోటర్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయన్ని స్థానిక సుపాల్‌ సదర్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెం‍దినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం సదర్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆశోక్‌ యాదవ్‌పై కాల్పులుకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి రాజకీయం కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement