గుంటూరు ఈస్ట్: మాయమాటలు చెప్పి రెండో పెళ్లికి సిద్ధపడిన వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన షేక్ సుభాని గుంటూరుకు చెందిన యువతి కుటుంబానికి తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని చెప్పి మోసగించి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు.
కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా, సుభాని మొదటి భార్య యువతి తల్లిదండ్రులకు సుభాని మోసాన్ని తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మాయమాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను పోలీసులు కోరారు. మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment