
ప్రతీకాత్మక చిత్రం
వికారాబాద్: పూడురులో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై హత్యాచారం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకెళ్లిన విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసి ఘటన కలకలం రేపింది.
బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు.నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం లభించడంతో అసలు విషయం వెలుగుచూసింది. సదరు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.