సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు, నగలు దోచుకెళ్లిన గ్యాంగ్..

Gang Posing As Cbi Officers Loot Rs 30 Lakh Jewellery West Bengal - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భవానిపుర్‌లో ఓ ముఠా సినీ ఫక్కీలో చోరీకి పాల్పడింది. సీబీఐ అధికారులమని చెప్పి ఓ వ్యాపారవేత్త ఇంటిపై రైడ్ చేసింది. ఇల్లంతా సోదాలు చేసి రూ.30 లక్షల నగదు, ఆభరణాలు దోచుకెళ్లింది. 7-8 మంది పురుషులు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

నకిలీ సీబీఐ అధికారుల చేతిలో మోసపోయి ఈ వ్యాపారవేత్త పేరు సురేష్ వాధ్వా(60). ఏడెనిమిది మంది మూడు కార్లలో సోమవారం ఉదయం 8గం.లకు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. వాళ్ల వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. సీబీఐ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, ఐడీ కార్డు అడిగినా చూపించలేదని వివరించాడు.

ఈ గ్యాంగ్ ఇల్లంతా సోదాలు చేసి రూ.30లక్షల నగదు, కొన్ని లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారని సురేష్ తెలిపాడు. ఏమేం సీజ్ చేశారనే లిస్ట్‌తో పాటు, విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా తర్వాత పంపిస్తామని చెప్పి ఆ ముఠా వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. తాను మోసపోయానని తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

అయితే ఈ దోపిడీలో సురేశ్ సన్నిహితులు లేదా అతనికి బాగా తెలిసిన వాళ్ల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి ఆ మూడు కార్ల వివరాలు తెసుసుకుని నిందితుల కోసం గాలిస్తామన్నారు.
చదవండి: షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top