స్థల వివాదంలో కత్తితో దాడి

Farm Belonging To Temple Is Dispute Between Two Parties - Sakshi

తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి గ్రామంలో ఒక ఆలయ స్థల వివాదం రక్తసిక్తంగా మారింది. దాడుల్లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ ఘోరం గురువారం రాత్రి జరిగింది.   

కత్తితో విచక్షణారహితంగా దాడి   
గ్రామంలో దేవాలయానికి చెందిన ఒక ఎకరా పొలంపై వివాదం నడుస్తోంది. ఈ పొలం పక్కనే ఉన్న భూమి కూడా తనదేనని శ్రీధర్‌ గుప్త గొడవచేసేవాడు. ఇది కోర్టులో ఉండగా రెండు వర్గాలకు చెందినవారు తరచూ గొడవపడేవారు. రాత్రి కూడా ఇలాగే ఘర్షణ జరిగింది. శ్రీధర్‌ గుప్త కత్తితో విచ్చలవిడిగా దాడి చేయడంతో రామాంజనయ్య (48), శిల్ప (38) అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మల్లికార్జున అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడి మధుగిరిలో చికిత్స చేయించి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్‌ గుప్త, అతని సంబం«దీకులు తమపై దాడి చేశారని మృతుల కుటుంబీకులు తెలిపారు.   

ఎస్పీ పరిశీలన  
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్‌ కుమార్‌ శహాపూర్‌వాడ్‌ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మధుగిరి ఆస్పత్రికి తరలించారు. మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు శ్రీధర్‌ గుప్త పరారీలో ఉన్నాడు.    

(చదవండి: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగాజలం జల్లుతూ..!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top