ఫేస్‌బుక్‌ పరిచయం: ప్రేమ పేరుతో మైనర్‌పై లైంగిక దాడి..

Facebook Friendship: Man Molested On Mnor In The Name Of Love - Sakshi

సాక్షి,పెనమలూరు: ఇంటర్‌ చదువుతున్న బాలికతో(17) పరిచయం పెంచుకుని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేసిన యువకుడు, అతనికి సహకరించిన మరి కొందరు యువకులపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరు గుమ్మడితోటకు చెందిన బాలిక తల్లిదండ్రులు విడిపోవటంతో మేనమామ ఇంట్లో ఉంటూ విజయవాడలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో బాబీ, గోవిందు, నిఖిల్, బుజ్జి, అవినాష్‌తో పరిచయం ఏర్పడింది.

అయితే విజయవాడ పటమటలో నివాసం ఉండే గోవిందు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికను కానూరులో బాబీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన తరువాత బాలిక తనను మోసం చేయవద్దని పెళ్లి చేసుకోవాలని గోవిందును కోరింది. దీంతో గోవిందుతో పాటు అతని మిత్రులు తమ వద్ద ఫొటోలు ఉన్నాయని, అవి బయటపెడతామని బాలికలను బెదిరించసాగారు. దీంతో బాలిక పెనమలూరు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు గోవిందుతో పాటు అతని మిత్రులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

చదవండి: ప్రియుడి నాటకంతో శానిటైజర్‌ తాగి ప్రియురాలి ఆత్మహత్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top