
లవర్ అశూ, షాలిని, ఆకాష్(వరుసగా)
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది.
వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు.
ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు.
ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.
అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..!