ఆలుమగలను మింగిన అప్పులు | Couple Passed Away Within Week Due To Debt And Financial Problems In Mahabubabad | Sakshi
Sakshi News home page

ఆలుమగలను మింగిన అప్పులు

Feb 22 2022 1:50 AM | Updated on Feb 22 2022 1:50 AM

Couple Passed Away Within Week Due To Debt And Financial Problems In Mahabubabad - Sakshi

మృతురాలు బోడి, అనాథలైన కుమారులు 

మహబూబాబాద్‌ రూరల్‌: అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందారు. దీంతో వారి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం శివారు బోడతండాలో సోమవారం ఈ విషాదం జరిగింది. బోడతండాకు చెందిన కౌలురైతు బోడ సిరి మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేయగా నష్టం వచ్చింది. రూ.6 లక్షల అప్పు, వడ్డీ రూ.4 లక్షలు కలుపుకుని మొత్తం రూ.10 లక్షలు కుటుంబానికి భారమయ్యాయి.

దీంతో సిరి ఈ నెల 14న తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. అంతకుముందే జనవరి 31న సిరి భార్య బోడి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె  చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. కాగా, తన కుమార్తె మృతికి భర్త సిరి, బావ లింగ్యా కారణమని బోడి తండ్రి బానోత్‌ మత్రు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరి బాగా తాగివచ్చి గొడవ చేస్తుండగా వద్దన్నందుకు లింగ్యా, సిరి కలిసి గడ్డి మందులో యాసిడ్‌ కలిపి బోడికి తాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement