కోడెల శివరామ్‌పై చీటింగ్‌ కేసు నమోదు | Cheating Case Filed On Kodela Siva Ram | Sakshi
Sakshi News home page

కోడెల శివరామ్‌పై చీటింగ్‌ కేసు నమోదు

Jul 19 2022 8:41 AM | Updated on Jul 19 2022 8:48 AM

Cheating Case Filed On Kodela Siva Ram - Sakshi

తెనాలి రూరల్‌: దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్‌కు చెందిన కైరా ఇన్‌ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్‌ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు.

వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్‌ఐ జి.ఏడుకొండలు శివరామ్‌పై చీటింగ్‌ కేసును సోమవారం నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement