టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు

CBI Searches Telugu MP Residence In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి  ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్‌ చేశారు. వారిని రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌ కుమార్‌గా గుర్తించారు. సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు.

మిగిలిన వారిద్దరూ ఎవరో తెలియదు: ఎంపీ
సీబీఐ సోదాలపై ఎంపీ మాలోతు కవిత స్పందించారు. దుర్గేష్‌కుమార్‌ తమ డ్రైవర్ అని, నా నివాసంలోని స్టాఫ్‌ క్వార్టర్స్‌ అతనికి ఇచ్చానని పేర్కొన్నారు. మిగిలిన వారిద్దరూ ఎవరో తనకు తెలియదన్నారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని.. పట్టుబడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.‌
చదవండి:
మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో దారుణం..
నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top