రెండేళ్ల కోసం కక్కుర్తి.. మూడేళ్లుగా పరారీలో.. చివరకు

ASI Fake Certificate Fraud In Hyderabad - Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌: పదవీ విరమణకు సంబంధించి బెన్‌ఫిట్స్‌ ఫోరం సబ్‌మిట్‌ చేయమంటూ హైదరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి సంకేతాలందడంతో తనకు మరో రెండేళ్ల గడువు ఉందని, ఇప్పట్లో రిటైర్మెంట్‌ లేదంటూ కమిషనర్‌ కార్యాలయానికి కొన్ని ఫోర్జరీ పత్రాలను సబ్‌మిట్‌ చేశాడు సంతోష్‌నగర్‌ పీఎస్‌లో విధులు నిర్వర్తించే ఏఎస్సై మహ్మద్‌ అబ్దుల్‌ రౌఫ్‌. ఉద్యోగంలో చేరేప్పుడు 3–5–1960 తేదీతో ఉన్న ఎస్సెస్సీ మెమో, బొనోఫైడ్, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ను ఇచ్చిన ఇతడు తన పుట్టిన ఏడాది 1960 కాదని, 1962 అంటూ సీపీ కార్యాలయంలో చెప్పుకొచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఒరిజనల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ సబ్‌మిట్‌ చేయాలంటూ సీపీ కార్యాలయ సిబ్బంది ఆదేశించారు. మహ్మద్‌ అబ్దుల్‌ రౌఫ్‌ బోనోఫైడ్‌లో ఉన్న ఒక లైన్‌లో తన పుట్టిన సంవత్సరం 1962 అని రాసుకుని సబ్‌మిట్‌ చేశాడు. దీంతో మే 31వ తేదీ 2018న పదవీ విరమణ ఉండగా.. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి పోలీసు శాఖను మోసం చేయాలని చూసిన రౌఫ్‌పై 30వ తేదీన కమిషనర్‌ కార్యాలయం ఫిర్యాదు ఇవ్వడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 

మూడేళ్లుగా పరారీలో.. పక్కాగా పట్టివేత 
కేసు నమోదైన విషయం తెలుసుకున్న మహ్మద్‌ అబ్దుల్‌ రౌఫ్‌ పరారీలో ఉన్నాడు. అయితే ఇటీవల నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భూపతి గట్టుమల్లు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పదిరోజుల పాటు కానిస్టేబుల్‌ మల్లేష్, హోంగార్డు ఇమ్రాన్‌లను ఈ కేసుపై ని ఘా పెట్టించారు. మహ్మద్‌ అబ్దుల్‌ రౌఫ్‌ కొద్దిరో జులగా భవానీనగర్‌లోని ఇంటిలోనే ఉంటున్నా డు. ఈ సమాచారం పక్కాగా ఉండటంతో.. బుధవారం రాత్రి నైట్‌ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి తెల్ల వారుజామున సిబ్బంది మల్లేష్, ఇమ్రాన్‌లతో కలసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గట్టుమల్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top