చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని వివరించారు.
విద్యుత్ సమస్యలపై
5 ఫిర్యాదులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. నగరిలో సోలార్ సర్వీసు పేరు మార్పు చేయాలని వినియోగదారుడు ప్రకాష్ విన్నవించినట్లు చెప్పారు. అలాగే చిత్తూరులోని ఎల్‌బీపురంలో సోలార్ సర్వీసు చార్జ్ చేయాలని చిట్టిబాబు ఫిర్యాదు చేశారన్నారు. పలమనేరులోని కొనమాకులపల్లెలో ఆర్‌డీఎస్‌ఎస్ కరెంటు స్తంభాలను తమ స్థలంలో పెట్టారని సుబ్రమణ్యంరెడ్డి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పూతలపట్టు ముత్తిరేవులలో నూతన లైన్ అసంపూర్తిగా వేశారని రామకృష్ణ, యాదమరి కాశిరాలలో ఎండోమెంట్ స్థలంలో సర్వీసు ఇవ్వవద్దని దేవరాజులు కోరినట్లు వివరించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్‌ఈ ఆదేశించారు.
14న అగ్రి బాండ్ల వెరిఫికేషన్
బంగారుపాళెం : మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులు బాండ్లను ఈ నెల 14వ తేదీన చిత్తూరులోని సాయుధ దళ కార్యాలయ ఆవరణలో వెరిఫికేషన్ చేయున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు సీఐడీ అధికారుల బృందం చేపట్టే వెరిఫికేషన్‌కు ముఖ్యమైన పత్రాలను తీసుకువెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు.
20 ఏళ్లుగా ఒకే చోట
విధులపై ఫిర్యాదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గత 20 ఏళ్ల నుంచి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌందరరాజనన్‌పై విచారణ జరిపించి, ఆయనను ఇతర జిల్లాకు బదిలీ చేయాలని కోరు తూ చిత్తూరు న్యాయవాది ఎం.అర్షద్ అయూబ్ ఖాన్ కోరారు. సోమవారం ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకే కార్యాలయంలో ఇరవై ఏళ్లుగా ఎలా విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సౌందరరాజనన్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్ కార్యదర్శికి లేఖలు రాసినట్లు వెల్లడించారు.
చిన్నారికి చేయూత
చిత్తూరు కలెక్టరేట్ : నిబంధనలు, విచారణలు, కాగితాల ప్రక్రియల కంటే మానవ త్వం మిన్న అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నిరూపించా రు. బంగారుపాళ్యం మండలం సంక్రాంతిపల్లెకు చెందిన చిన్నారి శిల్ప (10) ను చూసి కలెక్టర్ హృదయం చలించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శిల్పకు వైద్య పరీక్షలు చేయించేందుకు సైతం నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందించింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక స్థితిని వివరించి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది. స్పందించిన కలెక్టర్ వెంటనే తన జేబులోనుంచి సొంత నగదును తీసి తక్షణ సాయం అందించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.
క్రీడల్లో రాణిస్తే
మంచి గుర్తింపు
నూజివీడు: క్రీడల్లో రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌డీ స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన అండర్–16 బాలబాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలు నూజివీడులో ముగిశాయి. బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కోరారు. ఎల్. రామదాసు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
వీరే విజేతలు
బాలికల విభాగం: శ్రీకాకుళం (ప్రథమ), కర్నూ లు (ద్వితీయ), చిత్తూరు (తృతీయ స్థానం).
బాలుర విభాగం: బాపట్ల (ప్రథమ స్థానం), నెల్లూరు (ద్వితీయ స్థానం), తిరుపతి (తృతీయ స్థానం).


