చట్ట ప్రకారమే పనిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

చట్ట ప్రకారమే పనిచేస్తాం

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

● పోలీస్‌ అంటే ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసే ఉద్యోగం కాదు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ.. సామాన్యుల నుంచి ఎంతటివారు వచ్చిన చట్టానికే లోబడే పనిచేస్తాం.పోలీసుపై రాజకీయపార్టీ ముద్ర వేయడం కరెక్ట్‌ కాదు. ఏ పార్టీ అనేది మాకు ప్రధా నం కాదు. అందరూ ఒక్కటే. స్థానిక సంస్థల ఎన్నికలు, పోలింగ్‌పై ఇప్పటికే డీజీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మా ప్రణాళిక సిద్ధం చేసుకు న్నాం. ఏయే టీమ్‌ ఎలా పనిచేయాలో కార్యాచరణ రూపొందించాం. జిల్లాలోని బలగాలు చాలకపోతే, అదనపు బలగాలను సైతం తెప్పించుకుంటాం. ● 2021, 2024 న ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల ఆధారంగా జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా విభజించుకున్నాం. ఈసారి ఎన్నిక ల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గుడిపాల, చిత్తూరు రూరల్‌, కుప్పం, వి.కోట, పంజాణి తదితర ప్రాంతాల్లో గతంలో ఎదురైన శాంతిభద్రతల సమస్యలను గుర్తించి.. వాటిని క్షేత్రస్థాయిలో నేనే పరిశీలిస్తున్నా. ● రాజకీయ పార్టీలు వాళ్ల ఐడియాలజీ ప్రకారం ప్రచారం, విమర్శ– ప్రతివిమర్శ చేసుకుంటే ఓకే. వ్యక్తిగతంగా తిట్టుకోవడం, కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలం వాడడం, సామాజిక మాధ్యమాల్లో ఏఐ కంటెంట్లు పెట్టి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేదిలేదు. కోడ్‌ వచ్చిన వెంటనే ప్రతి సోషల్‌ మీడియాపై మా నిఘా ఉంటుంది. ఏది పడితే అది పోస్టు చేస్తే చర్యలు తప్పవు. ● ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే మా కర్తవ్యం. మద్యం, నగదుకు ప్రజలు లొంగకుండా పోలీసులకు కో–ఆపరేట్‌ చేయాలి.

సాక్షి, చిత్తూరు: ఎన్నికల శంఖారావం మోగిందంటే ముందుగా కదలాల్సిందే ఖాకీలే. పార్టీలు ఏవైనా అధికారపక్షం బెదిరింపులు, ప్రతిపక్ష పోరాటం మధ్య నాలుగో సింహం ఏమీ చెప్పలేక నలిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈసారి తక్కువ వ్యవధిలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రారంభమైంది. ఓవైపు మున్సిపల్‌ ఎన్నికలు, వెను వెంటనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పోలీసుల పాత్ర చాలా కీలకంగా మారనుంది. స్థానిక ఎన్నికలపై జిల్లా పోలీసు బాసు వ్యూహం ఏంటి..? ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు..? ప్రజలను స్వేచ్ఛగా ఓటు వినియోగించే వాతావరణం కల్పిస్తారా..? లాంటి ప్రశ్నలపై ఎస్పీ తుషార్‌ డూడీ ‘సాక్షి’కి సమాధానమిచ్చారు. ఆయన మాటల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement