ఈ చీపుర్లు మాకొద్దు! | - | Sakshi
Sakshi News home page

ఈ చీపుర్లు మాకొద్దు!

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

●మార్కెట్లో రూ.60 ● ఐకేపీ కార్యాలయం నుంచి వచ్చినవి రూ.120 ● కొనాల్సిందే అని సంఘ మిత్రల ఒత్తిడి ● కొనలేమంటున్న డ్వాక్రా సభ్యులు

పాలసముద్రం : ఐకేపీ జిల్లా కార్యాలయం నుంచి పంపిన చీపురు కట్టలను మేం కొనలేమని డ్వాక్రా సభ్యులు నిరాకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులకు తక్కువగా అందించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఐకేపీ కార్యాలయంలో చీపుర్లు తయారుచేయించారు. మార్కెట్లో చీపురు కట్టలను రూ.60కు విక్రయిస్తుండగా ఐకేపీ కార్యాలయంలో తయారుచేసిన చీపురు కట్టలు రూ.120కి విక్రయిస్తున్నారు. గమనించిన డ్వాక్రా సంఘాల సభ్యులు తమకు చీపర్లు వద్దంటున్నారు. చీపురు కట్టలు ఎలా విక్రియించాలో తెలియక ఐకేపీ అధికారులు సీసీలపై ఒత్తిడి చేపట్టారు. సీసీలు సంఘమిత్రలపై ఒత్తిడి చేసి ప్రతి సంఘం సభ్యులు చీపుర్లను తప్పకుండా తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. లేకుంటే బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి, సీ్త్రనిధి వంటివి అందవని భయపెడుతున్నారు. అప్పటికీ చీపుర్లు నాణ్యత లేవని కొందరు నిరాకరించారు. కొన్ని పంచాయతీల్లో సంఘమిత్రలు సంఘాల్లోని సభ్యులను లెక్కంచి చీపుర్లు పంచి పెట్టారు. సంఘ సభ్యులు చీపర్లు తీసుకుని నగదు ఇవ్వలేదు. సంఘమిత్రలు గ్రూపు లీడర్ల వద్ద బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్లో విక్రయిస్తున్న ధరలకే ఐకేపీ కార్యాలయంలో తయారు చేసిన చీపుర్లను విక్రయించాలని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement