రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన యాత్ర | - | Sakshi
Sakshi News home page

రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన యాత్ర

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, రైతులకు ఆధునిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక విజ్ఞాన యాత్ర ప్రారంభమైంది. చిత్తూరు నగరంలోని తన కార్యాలయం వద్ద సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి బి.మురళి ఈ యాత్రను ప్రారంభించారు. సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు వారం రోజుల పాటు అవగాహ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి ఎంపికై న జిల్లాకు చెందిన 25 మంది రైతులు తెలంగాణలోని ప్రముఖ కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధన స్థానాలను సందర్శించనున్నారు. చిరుధాన్యాలు, నూనెగింజల సాగులో కొత్త మెళకువలు, అధిక దిగుబడి సాధించే పద్ధతులను అక్కడ నేరుగా పరిశీలించి తెలుసుకుంటారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement