● డిగ్రీ కళాశాలల్లో ముగిసిన రెండు విడతల ప్రవేశాల ప్రక్రియ ● మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ నిర్వహిస్తారా? ● కళాశాలల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు | - | Sakshi
Sakshi News home page

● డిగ్రీ కళాశాలల్లో ముగిసిన రెండు విడతల ప్రవేశాల ప్రక్రియ ● మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ నిర్వహిస్తారా? ● కళాశాలల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

● డిగ్రీ కళాశాలల్లో ముగిసిన రెండు విడతల ప్రవేశాల ప్రక్రియ ● మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ నిర్వహిస్తారా? ● కళాశాలల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు

మిగిలిన సీట్ల భర్తీ ఎప్పుడో?

తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో గత నెల 30వ తేదీతో రెండు విడతల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 45శాతం సీట్లు మాత్రమే భర్తీకాగా, టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న కళాశాలల్లో కాస్త మెరుగైన ప్రవేశాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఓఏమ్‌డీసీ ద్వారా చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోనే ప్రవేశాలలో భారీ తేడా ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘స్పాట్‌’ నిర్వహిస్తారా?

యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పలు డిగ్రీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఓఏమ్‌డీసీ మూడో విడత కౌన్సిలింగ్‌ ప్రక్రియకు అవకాశం ఇస్తుందా..? లేక స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతి ఇస్తుందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ప్రతి రోజూ కళాశాలల చుట్టూ సీటు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రెండవ విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు సైతం స్పాట్‌ అడ్మిషన్లు ఈ వారంలోనే నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏనుగుల సమస్య పరిష్కారంపై దృష్టి

పలమనేరు: కౌండిన్య ప్రాంతంలో ఏనుగుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎఫ్‌ఆర్వో శ్రీనివాసు లు రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఎఫ్‌ఆర్వోగా బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని మదపుటేనుగుల కట్టడి కోసం కుంకీ ఎలిఫెంట్‌ క్యాంపును ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కుంకీల ద్వారా మదపుటేనుగులను బంధించే ప్రక్రియ కూడా గతంలో ఇక్కడ విజయవంతమైందని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడవిలోని ఏనుగులు రైతుల పంట పొలాల్లోకి వెళ్లకుండా ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ ద్వారా మళ్లించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రెవెన్యూ అక్రమాలపై విచారణకు ఆదేశాలు

పలమనేరు: గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తూ ఇక్కడే పదవీ విరమణ చెందిన కుప్పుస్వామి, కొందరు సిబ్బంది కలిసి తప్పుడు రికార్డులు సృష్టించారనే విషయమై కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్టు సోమవారం తెలిసింది. కాగా ఇదే కార్యాలయానికి సంబంధించి వేర్వేరు వ్యవహారాల్లో పలువురు వీఆర్వోలు, కొందరు తహసీల్దార్లపై సైతం కోర్టు ఆదేశాలతో పోలీసు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన ఇన్బునాథన్‌ సైతం ప్రస్తుతం సెలవుపై వెళ్లారు. దీంతో ఇక్కడ రమేష్‌ రెడ్డి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా కుప్పుస్వామి వ్యవహారంలో ఎవరు ఫిర్యాదు చేశారనేది శాఖాపరమైన విచారణ పూర్తయ్యాక తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement