సాధించిన సిండికేటు! | - | Sakshi
Sakshi News home page

సాధించిన సిండికేటు!

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

జిల్లాలో 16 దుకాణాల లైసెన్సులు ‘కూటమి’కి ప్రభుత్వ ఖజానాకు రూ.3 కోట్లకు పైనే నష్టం పూర్తయిన మద్యం దుకాణాల కేటాయింపు సొంత లాభం.. నెగ్గిన సిండికేటు పంతం

సాక్షి, చిత్తూరు: వారు తమ పంతం నెగ్గించుకున్నారు. సొంత లాభం మరింత పెంచుకుని, ప్రభుత్వ ఖజానాను గండి కొట్టి మరీ పైచేయి సాధించారు. జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లలో అధికార పార్టీ నేతల అభయ హస్తంతో రంగంలోకి దిగిన పలువురు నిర్వాహకులు, అనుకున్నట్టే కూటమిగా ఏర్పడి దుకాణాలను దక్కించుకున్నారు.

పాలసీ లీకు.. రూ.కోట్ల నష్టం

అధికారం చేతిలో ఉంటే అడ్డదారుల్లో ఏమేమి చేయొ చ్చే కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల విషయంలో మరోసారి స్పష్టం చేసింది. గడువు ముగిసిన మద్యం దుకాణాల లైసెన్సులకు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలి. అలా చేయకుండా 90 శాతానికి పైగా మద్యం దుకాణాలను చేతుల్లో పెట్టుకున్న పచ్చ కార్యకర్తలకు ఉపాధి చూపిస్తూ రెన్యువల్స్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సగటున ఒక్కో మద్యం దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెన్యువల్‌ చేసుకోకపోతే ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల నాన్‌–రీఫండబుల్‌ దరఖాస్తు రుసుము, ప్రతి దుకాణానికి నాలుగు దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్‌ తీస్తామని పాలసీ విషయాన్ని లీకు చేసింది. రెన్యువల్‌ చేసుకోకుంటే ఏం చేయాలనే విషయాన్ని దరఖాస్తులు అందకపోతే అప్పుడు ప్రకటించాల్సి ఉంది. ఫలితంగా జిల్లాలో 113 మద్యం దుకాణాలకు గానూ 95 దుకాణాలు రెన్యువల్స్‌ చేసుకున్నారు. మిగిలిన 18 దుకాణాల నిర్వాహకులు పాలసీలోని లోపాన్ని గుర్తించి, ఆయా నియోజకవర్గాల్లోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో చేతులు కలిపారు. అందరూ సిండికేట్‌గా ఏర్పడి నాలుగు దరఖాస్తులతో సరిపెట్టి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, దుకాణాలకు దక్కించుకున్నారు. నేతల నిర్వాకంతో జిల్లాలో మద్యం దుకాణాలకు తక్కువ దరఖాస్తుల పడడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం నష్టం వాటిల్లింది.

రెన్యువల్స్‌తో గగ్గోలు

మరోవైపు మద్యం దుకాణాలను రెన్యువల్‌ చేసుకున్న 95 మంది నిర్వాహకులు, సిండికేట్‌ మాయాజాలం చూసి గగ్గోలు పెడుతున్నారు. తప్పనిసరిగా రెన్యువల్‌ చేసుకోవాలని, లేనిపక్షంలో ఒక్కో దుకాణానికి పది దరఖాస్తులనే నిబంధన వస్తే రూ.30 లక్షలు నాన్‌–రీఫండబుల్‌ నగదు కింద చెల్లించాలని అధికారులు భయపెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో తాము రెన్యువల్‌ చేసుకుని సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించామన్నారు. కానీ 16 దుకాణాలకు దక్కించుకోవడానికి సిండికేట్‌గా ఏర్పడిన వారు రూ.12 లక్షలకే దుకాణాలు దక్కించుకుని, డబుల్‌ కిక్కు పొందారని వాపోతున్నారు.

పాత వారికే మద్యం దుకాణాలు

పాత వాళ్లకే దుకాణాలు

చిత్తూరులో గురువారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఆధ్వర్యంలో లక్కీడిప్‌ తీశారు. మొత్తం 19 దుకాణాలకు టెండర్లు పిలిస్తే పెద్దపంజాణిలో కల్లుగీత సామాజిక వర్గానికి కేటాయించిన దుకాణానికి ఎవరూ దరఖాస్తు చేయలేదు. వి.కోటలోని రెండు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అవి మిగిలిపోయాయి. ఇక జిల్లాలో మిగిలిన 16 దుకాణాలను లక్కీడిప్‌ ద్వారా లైసెన్సులు కేటాయించారు. ఇందులో నాలుగు దుకాణాలకు పేరుకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు అందగా, మిగిలిన అన్నింటికీ నాలుగు దరఖాస్తులే అందాయి. సిండికేట్‌ అనుకున్నట్లే రూ.12 లక్షలు, రూ.15 లక్షలకే లైసెన్సులు దక్కించుకున్నారు. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌, జిల్లా ప్రొబేషన్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరుల సమక్షంలో లక్కీడిప్‌ నిర్వహించారు. ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా లైసెన్సులను జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement