విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యం

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

● కేంద్రీయ విద్యాలయలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రస్తుతం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఇరువారంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్‌ అనీల్‌ కుమార్‌ అధ్యక్షతన పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయలో చదువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, ఆధునిక విద్యను అందించడమే లక్ష్యంగా జిల్లా యాజమాన్యం అడుగులు వేస్తోందన్నారు. నేటి డిజిటల్‌ యుగంలో విద్యార్థులు సాంకేతికతలో ముందంజలో ఉండాలన్నారు. పిల్లలకు ఏబీసీడీల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కోడింగ్‌, డిజిటల్‌ నైపుణ్యాలపై అవగాహన కలిగించాలని సూచించారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థికి కంప్యూటర్‌ పరిజ్ఞానం అందుబాటులోకి రావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల్లోని కళాత్మకతను వెలికితీయడానికి, మానసిక వికాసానికి తోడ్పడేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మ్యూజిక్‌ టీచర్‌ను నియమించుకోవాలని సూచించారు. చదువుల ఒత్తిడి, పరీక్షల భయాన్ని అధిగమించడానికి శాశ్వత కౌన్సిలర్‌ వచ్చేంత వరకు సమగ్ర శిక్ష శాఖలో అర్హత ఉన్న మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ను పాఠశాలకు కేటాయించాలని ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషశ్రీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement