స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసిద్ధం చేసినట్టు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా గురువారం అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కలెక్టర్‌, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వార్డులు, పంచాయతీల వారిగా లోపాలు లేని తుది ఓటర్ల జాబితాలను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా ఎన్నికల సామగ్రి (మెటీరియల్‌) సేకరణ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌ కుమార్‌, జెడ్పీ సీఈఓ రవికుమార్‌ నాయుడు, డీపీఓ సుధాకర్‌ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణపై పోరు తథ్యం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. చిత్తూరు నరగరంలోని రెవెన్యూ భవనంలో గురువారం జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బస్సులను ఆర్టీసీయే సొంతంగా కొనుగోలు చేసి నడపాలని డిమాండ్‌ చేశారు. మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలను పునః ప్రారంభించాలని కోరారు. సంస్థలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను రెగ్యులర్‌ పద్ధతిలో భర్తీ చేయాలని, 4 వేల కొత్త బస్సులను సమకూర్చా లని విజ్ఞప్తి చేశారు. సీసీఎస్‌ ఎన్నికల్లో ఈయూ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.జగన్నాథం, కె.బలరామమూర్తి పాల్గొన్నారు.

నేడు అగ్రిగోల్డ్‌ బాండ్ల వెరిఫికేషన్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలోని గుడిపాల, పెనుమూరు మండలాలకు చెందిన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, బాధితుల బాండ్ల వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో చేపట్టనున్నారు. బాధితులు ఒరిజినల్‌ బాండ్‌తో పాటు సంతకం చేసిన కలర్‌ జిరాక్స్‌, ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఫొటోలు తీసుకుని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సీఐడీ అధికారులకు అందజేయాలి. అధికారులు ఒరిజినల్‌ బాండ్లను పరిశీలించి ధ్రువీకరణ రసీదు ఇస్తారు. మిగిలిన మండలాల బాధితుల బాండ్ల పరిశీలన తేదీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement