వనరుల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

వనరుల దోపిడీ

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

● ఇసుక, మట్టి, గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు ● అక్రమార్కుల నుంచి కప్పం వసూలు చేస్తున్న ప్రజా ప్రతినిధులు ● ఒక్కో క్వారీ నుంచి రూ.25 లక్షల డిమాండ్‌ ● గ్రానైట్‌ శ్లాబులను తమిళనాడుకు తరలింపు ● దొంగ జీఎస్టీ బిల్లులతో సొమ్ముచేసుకుంటున్న వైనం ● చూస్తూ ఊరుకుంటున్న అధికార యంత్రాంగం

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పలమనేరు పరిధిలోని క్యాటిల్‌ఫామ్‌ వద్ద యంత్రాలు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. కర్ణాటకకు దొడ్డిదారిన తరలిస్తూ టిప్పర్‌ ఇసుకను రూ.1.20 లక్షలకు విక్రయిస్తున్నారు. అలాగే కొత్తూరు, తీర్థం ప్రాంతాల్లోనూ స్థానిక నేతల ఆధ్వర్యంలోనే గ్రానైట్‌ దందా నడుస్తోంది. గ్రానైట్‌ కోసం గుట్టను మింగేస్తున్నారు.

నగరి మండలం రామాపురం ప్రాంతంలో అనుమతులకు మించి గుట్టలను పిండి చేసి కంకరగా మార్చి విక్రయిస్తున్నారు. అంతా ఓ టీడీపీ ముఖ్య నేత అండదండలతోనే సాగుతోంది. నగరి నుంచి చైన్నె వెళ్లే మార్గంలో ఉన్న కొండలను యథేచ్ఛగా పిండిచేస్తున్నారు. రహదారుల కోసం అంటూ నిబంధనలకు విరుద్ధంగా కొండలను కొట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం దాసరిపల్లి, బంగారుపాళ్యం మండలం కనతలచెరువు గుట్టల్లో, ఐరాల మండలం బొమ్మసముద్రంలో అక్రమ క్వారీలు రెండున్నర ఏళ్లుగా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. మైనింగ్‌ శాఖ అధికారులు పూర్తిగా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కూటమి నేతల మైనింగ్‌ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌పురం మండలం తెల్లగుండ్లపల్లి, మంగుట, పాలసముద్రంలోని నరసింగాపురంలో భారీగా అక్రమ గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన, కార్వేటినగరం మండలంలోని కుశస్థలి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేస్తూ తమిళనాడుకు తరలిస్తున్నారు.

చిత్తూరు నగరం నరిగపల్లిలోని గుట్టను పిండిచేసి ఆ రాళ్లను అనుమతులు లేని సొంత కంకర ఫ్యాక్టరీలో ప్రాసెస్‌ చేసి తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే చిత్తూరు మండలంలోని నాయని చెరువులో ఓ ప్రజాప్రతినిధి సహకారంతో గ్రానైట్‌ తోడేస్తున్నారు.

బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌
ముగ్గురు దొంగలను అరెస్టు చేసి 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీలు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో ఆ‘గని’ దందా

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

చిత్తూరు జిల్లాలో ప్రకృతి వనరుల దోపిడీ పరాకాష్టకు చేరింది. అధికారం అండను చూసుకుని పచ్చనేతలు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. కొండలు, గుట్టలను పిండిచేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అన్ని అనుమతులతో నిర్వహిస్తున్న క్వారీల నిర్వాహకులనూ వదలడం లేదు. వ్యాపారం సాఫీగా సాగాలంటే నెలకు రూ.25 లక్షల వరకు ముడుపులు సమర్పించుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వాగులు, వంకలు, పొలాల నుంచి ఇంటి నిర్మాణం కోసం గుప్పెడు మట్టి లేదా ట్రాక్టర్‌ ఇసుక తోలుకుంటున్న పేదల నుంచి కప్పం వసూలు చేస్తున్నారు. ఈ విషయాలు తెలిసినా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్‌ దోపిడీపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.

నరిగపల్లిలో గుట్టను తవ్వేస్తున్న స్థానిక టీడీపీ నేతలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో కూటమి నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రకృతి వనరులను సొంత సంపదగా దోచుకంటున్నారు. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు దొంగ జీఎస్టీ బిల్లులు వేసి అక్రమంగా గ్రానైట్‌ స్లాబ్‌లను అమ్మేస్తున్నారు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో జీఎస్టీ కట్టాల్సి వస్తోందని.. టీడీపీ నేతలు, అక్రమార్కులు, వ్యాపారులు దొంగబిల్లులకు అలవాటు పడిపోయారు. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలకు రూ.30 వేలు ఇస్తే.. దొంగ జీఎస్టీ బిల్లులు ఇట్టే ఇచ్చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.

ప్రాంతాల వారిగా

అక్రమ తవ్వకాలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement