శ్రీసిటీకి ప్రపంచ ఖ్యాతి వైఎస్సార్‌ చలవే | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీకి ప్రపంచ ఖ్యాతి వైఎస్సార్‌ చలవే

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

● ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ● జగనన్నతోనే ఆర్థిక సమానత్వం ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

వెదురుకుప్పం: సత్యవేడులోని శ్రీసిటీకి ప్రపంచ ఖ్యాతి రావడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి చలవేనని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఆయన ఆదివారం వెదురుకుప్పం మండలం ధర్మాచెరువు గ్రామంలో విలేకరుల తో మాట్లాడారు. సెజ్‌ల ఏర్పాటుతో యువతకు ఉపాఽ ది కల్పించడంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన యుగపురుషుడు వైఎస్సార్‌ అని కొనియాడారు. సత్యవేడులో శ్రీసిటీని ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. శ్రీసిటీ ఉన్నంత వరకూ వైఎస్సార్‌ గుర్తుకువస్తారన్నారు. అలాంటి చోట ప్రమాదంలో ఐదుగురు దు ర్మరణం చెందడం బాధాకరమన్నారు. వారిని ప్రభు త్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

జలయజ్ఞంతో అండగా...

వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం పేరు తో సుమారు 78 ప్రాజెక్టులు తీసుకువచ్చారని నారాయణస్వామి గుర్తు చేశారు. అందులో 20 ప్రాజెక్టులను పూర్తి చేశారని, మిగిలిన ప్రాజెక్టులు 80 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. రుణమాఫీ చేసి అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలకు ఊపిరి పోసి న ఘన చరిత్ర వైఎస్‌.రాజశేఖరరెడ్డికి దక్కుతుందన్నారు.

ఆర్థిక సమానత్వం జగన్‌కే సాధ్యం

సమాజంలో ఆర్థిక సమానత్వం వైఎస్‌.జగన్‌తోనే సాధ్యమని నారాయణ స్వామి తెలిపారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని, పెత్తందార్లు, కోటీశ్వరులకు కొమ్ముకాసేదని విమర్శించారు. చంద్రబాబు ఏనాడూ మంచి చేయరన్న నగ్న సత్యా న్ని గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలు గ్రహించారని చెప్పారు. మంచి చేసిన నాయకుడికి ఓట్లు వేయాలన్న ఆలోచన ప్రజలకు వచ్చినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్‌కి మద్దతు ఇచ్చినట్టు ఇక్కడ కూడా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఓట్లు వేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుకుమార్‌, మాజీ సర్పంచ్‌ హేమశేఖర్‌ రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జగదీశ్‌రెడ్డి, ముదిరాజ్‌ విభాగం గంగాధరనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు చెంగల్రాయులు, వడివేలు, పొన్నయ్య, వెంకటాచలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement