స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

బైరెడ్డిపల్లె: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం బైరెడ్డిపల్లె లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై త్వర లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశా రు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని, అన్ని వర్గాల ఓటర్ల మద్దతు కూడగట్టుకోవాలన్నారు. చంద్రబాబు అండ్‌ కో ప్రజలకు చేసే మోసాలు, రాష్ట్రంలో కొనసాగిస్తున్న అరాచ క పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గతంలో వైఎస్సార్‌ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి డబ్బా కొట్టించుకునే దుస్థితిలో కూటమి ప్రభు త్వం ఉందన్నారు. ప్రతి చోటా వైఎస్సార్‌ సీపీ అభ్య ర్థిని బరిలో నిలవాలని, పోటీ చేసి అన్ని చోట్లా గెలవాలన్నారు. సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతానికి, సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి స్థానిక పోరులో విజయం దోహదపడుతుందన్నారు. పార్టీ పరిష్టత కోసం పాటుపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ శ్రేణుల్లో ఎవరి మధ్య అయినా అభిప్రాయ బేధాలున్నా కలిసి మెలిసి పనిచేయాలన్నా రు. పార్టీ కార్యకర్తలే అంతిమమనే సత్యాన్ని తెలుసుకోవాలన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటాలని తెలిపారు. బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, దయానందగౌడు, మురళీక్రిష్ణ, కొండవీటి నాగభూషణం, పీఎన్‌ఎన్‌ నాగరాజు, మహబూబ్‌ఖాన్‌, తబ్రాజ్‌భాష, మహేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement