నేడు పోలీసు గ్రీవెన్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు గ్రీవెన్స్‌ డే

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమ వారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయాలని వివరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మా ట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

నేటి నుంచి

బీఈడీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌

తిరుపతి సిటీ: ఏపీ ఎడ్‌సెట్‌–2026 కౌన్సెలింగ్‌లో భాగంగా బీఈడీ కోర్సులో తొలివిడత ప్రవేశాలకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కమిషనరేట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక ప్రటనలో తెలిపారు. ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 12 తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మూడు నెలలుగా బీఈడీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట లభించింది.

ఆరోగ్య భద్రత అవసరం

తిరుపతి అర్బన్‌: వసతి గృహాల్లోని విద్యార్థుల కు ఆరోగ్య భద్రత అవసరమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో ఆయన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. దుస్తు లు, ఇతర సామగ్రి ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలని సూచించారు. స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి విజయలక్ష్మి, అడిషనల్‌ అధికారి జగదీష్‌, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి యశ్వంత్‌, డీసీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో సోమ వారం ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఆ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661కు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు.

ఘనంగా సంజ్ఞా భాషా దినోత్సవం

తిరుపతి అర్బన్‌ : కలెక్టరేట్‌లో ఆదివారం అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. సంజ్ఞా భాషలో ప్రత్యేక గుర్తింపు సాధించిన పలువురు ప్రముఖులను గుర్తు చేసుకున్నారు. అధికారులు గంఽగాధరం, రవణప్ప, కృష్ణారెడ్డి, నేతలు మనోజ్‌కుమార్‌, రెడ్డెప్ప, నిర్మల, ధనంజయులు, కల్యాణ్‌చక్రవర్తి, బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement