శ్రీవారి దర్శనానికి 18 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 91,296 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,805 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

ముక్కంటి సేవకు

పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాహు–కేతు పూజలు 4,520 జరిపించగా, రూ.36.93 లక్షల ఆదా యం సమకూరింది. వివిధ దర్శనాల ద్వారా 6,600 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ.9.25 లక్షలు ఆదాయం వచ్చింది. సేవలు, ప్రసాదాల విక్రయాలు, కల్యాణకట్ట తదితరాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపి సాయంత్రం వరకు మొత్తం రూ.51,31,884 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement