– కాలు పోగొట్టుకున్న యువకుడు
పుత్తూరు: ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవా లని రైల్వే పట్టాలపైకి వెళ్లాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన రైలు కాలు మీదుగా వెళ్లడంతో కాలు తెగి పడింది. ఈ సంఘటన ఆదివారం పుత్తూరు పట్టణ పరిధిలోని బొజ్జనెత్తం గ్రామం వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు మున్సిపాలిటీ 27వ వార్డులోని బొజ్జనెత్తం గ్రామానికి చెందిన నాగరాజు, అంజలి దంపతుల కుమారుడు చందు(23) తిరుపతి ఇస్కాన్ ఆలయంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. అప్పు చేసి గేమ్స్ ఆడి రూ.5 లక్షల వరకు నష్ట పోయాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో కాలు తెగిపడిపోయింది. స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


