చర్చనీయాంశమైన కై గల్లు భూముల వ్యవహారం | - | Sakshi
Sakshi News home page

చర్చనీయాంశమైన కై గల్లు భూముల వ్యవహారం

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

● అనుభవం లేని కంపెనీకి రూ.కోట్ల విలువైన భూములా? ● ఇంతకీ ఆ కంపెనీ కై గల్‌ వద్ద ఫుడ్‌ పార్కు నిర్మాణం చేస్తుందా?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం కై గల్లు గ్రామం వద్ద ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేయడానికి కంపెనీకి భూములు కేటాయింపుపై జోరుగా చర్చ సాగుతోంది. అనుభవం లేని కంపెనీకి రూ.కోట్ల విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఫుడ్‌ పార్కు ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఇక్కడి రైతులు ఆనందపడ్డారు. పదినెలల క్రితం రూ.9 లక్షలతో ప్రారంభించిన కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమిని పైసా తీసుకోకుండా ఉచితంగా ఎందుకిచ్చిందనే మాట జనం నోట వినిపిస్తోంది. ఇలాంటి డొల్ల కంపెనీ రూ.1,388.14 కోట్ల ప్రాజెక్టును చేపట్టేనా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ కంపెనీకి ఫుడ్‌ ప్రొసెసింగ్‌పై అనుభవం లేకపోవడం గందరగోళానికి గురిచేస్తోంది. రైతుల నుంచి సేకరించిన భూములను ఏపీఐఐసీ ఉచితంగా ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఫుడ్‌ పార్కు వస్తుందో లేదో గాని రూ.కోట్ల భూములను మాత్రం సులభంగా తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. మొత్తం మీద కై గల్లు భూముల మీద కన్నేసిన అధికార పార్టీలోని ముఖ్యనేతలే పక్కాగా స్కెచ్‌వేసి ఇక్కడి భూములను కొట్టేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించడం వల్ల అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement