చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం, విద్యారంగ పురోగతిలోనూ ప్రైవేట్ పాఠశాలల టీచర్లు చూపుతున్న అంకితభావం, నిరంతర కృషి ప్రశంసనీయమని డీఈవో లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాల సంఘం (అపుస్మా) చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా పా ల్గొన్న డీఈవో మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమైందన్నారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో విద్యా బోధన అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విశేష సేవలందించిన 85 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డీఈవో స్వయంగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసి ఉపాధ్యాయులను ప్రోత్సహించిన డీఈవోను అపుస్మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సీఆర్ మహేష్, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి లకీ్‌ష్మ్‌ప్రసాద్ సత్కరించారు. పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులకు సంఘం తర ఫున అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల అపు స్మా అధ్యక్షలు, కార్యదర్శులు, ట్రెజరర్లు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


