స్వర్ణ నెమలిపై గణనాథుడు | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ నెమలిపై గణనాథుడు

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

కాణిపాకంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా స్వామివారి గ్రామోత్సవం తరలివచ్చిన అశేష భక్తజనం మారుమోగిన గణపతి నామస్మరణ

కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం వినాయక నామస్మరణలతో మారుమోగుతోంది. బుధవారం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహ నంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద యం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత ఉభయదారులు ప్రత్యేకంగా క్షీరాభిషేకం, గంధాభిషేకం, నారికేళం అభిషేకాలు చేయించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించారు. తదుపరి బంగారు మయూర వాహనంపై కొలువుదీర్చి కోలాటాల నడుమ కనుల పండువగా ఊరేగించారు. భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు పట్టి నీరాజనాలు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement