చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. మాతా–శిశు సంరక్షణ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, బీపీ–షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులు, కంటి, చెవి పరీక్షలు, రక్తదాన శిబిరాలను క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.


