ఆటో బోల్తాపడి వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తాపడి వ్యక్తికి గాయాలు

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

వి.కోట: మండలంలోని తోటకనుమ–వి.కోట రోడ్డులోని మోర్నపల్లి గ్రామం వద్ద బుధవారం ఆటో బోల్తా పడడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తోటకనుమ గ్రామానికి చెందిన వరదప్ప కుమారుడు రాజశేఖర్‌ ఆటోలో వి.కోటకు బయ లుదేరాడు. మోర్నపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు వి.కోట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.

వరకట్నం వేధింపులపై కేసు నమోదు

పుత్తూరు: మహిళ ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరు మండలం నేసనూరుకు చెందిన వి.మునిలక్ష్మి(30)కి చైన్నె రాజకీలపాక్కానికి చెందిన ఎం.మణికంఠశివ అలియాస్‌ వరుణ్‌శివతో 2018లో వివాహమైంది. ఆ సమయంలో 20 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. వివాహం తర్వాత ఆస్ట్రేలియాలో కాపురం పెట్టిన మణికంఠశివ అదనపు కట్నం కింద రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించేవాడు. ఇతనికి అతని బంధువులైన శేఖర్‌, జానకి, విజయలక్ష్మీ, గోపి మద్దతు తెలిపారు. ఈ మేరకు మునిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement