మరో పదిరోజులు సర్‌ | - | Sakshi
Sakshi News home page

మరో పదిరోజులు సర్‌

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పూర్తికాని ఎన్యూమరేషన్‌ ఫారాల

సేకరణ

ఇప్పటికీ చేరని 1,34,890

డిజిటలైజేషన్‌ మాత్రం

ఒక శాతమే పెండింగ్‌

ఎస్‌ఐఆర్‌లో వెనకబడిన కుప్పం

సవరణ ప్రక్రియకు 24 వరకు గడువు పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం

ఏనుగుల బీభత్సం
గుడిపాల మండలం వెంగమనాయుడు కండ్రిగలో మంగళవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.
షెడ్యూల్‌ సవరింపు

పాత్రికేయులపై దాడిని సహించం

పాత్రికేయులపై తిరుపతిలో దాడి చేయడంపై చిత్తూరులో జర్నలిస్ట్‌లు మండిపడ్డారు. ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు.

బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026

99.97 శాతం డిజిటలైజేషన్‌

జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) డిజిటలైజేషన్‌ 99.97 శాతం పూర్తి అయినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్‌ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోందన్నారు. వంద శాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 1,511 మంది బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు పారదర్శకత కోసం ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవాలనుకునే వారు ఎన్నికల సంఘం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌ఓ సేవను ఉపయోగించుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజేంద్ర, వివిధ పార్టీల ప్రతినిధులు విజయసింహారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, సురేంద్రకుమార్‌, అట్లూరి శ్రీనివాస్‌, యశ్వంత్‌, రమేష్‌, బాలసుబ్రమణ్యం, లోకనాథం పాల్గొన్నారు.

జేసీ, డీసీ బాధ్యతల స్వీకరణ

చిత్తూరు కార్పొరేషన్‌: వాణిజ్యపన్నులశాఖ జాయింట్‌ కమిషనర్‌ హర్షవర్ధన్‌, డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసులునాయుడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో డీసీగా పనిచేస్తున్న హర్షవర్ధన్‌ ఉద్యోగోన్నతిపై చిత్తూరుకు వచ్చా రు. కావలి అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులునాయుడు ప్రమోషన్‌పై డీసీగా ఇక్కడికి వచ్చా రు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

నేటి నుంచే అమరావతి చాంపియన్‌ షిప్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీలను బుధవారం నుంచి ఆగస్ట్‌ 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పోటీలు చేపట్టినట్లు వెల్లడించారు. ల్లాకు చెందిన అండర్‌–17, అండర్‌–23 బాలు రు, బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ సమయంలో తప్పనిసరిగా వయసు ధృవీకరణ పత్రం (10వ తరగతి మార్కుల జాబితా) సమర్పించాలన్నారు. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాడ్మింటన్‌, బాస్కె ట్‌ బాల్‌, చెస్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, యోగా, బాక్సింగ్‌ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే rportr.ap.gov.in వెబ్‌సైట్‌లో నిర్ణీ త గడువులోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. గతంలో శాప్‌ సమ్మర్‌ క్యాంప్‌, కోచింగ్‌, అసోసియేషన్‌ గేమ్స్‌ లో నమోదైన వారికి ఆధార్‌ ఓటీపీ వెరిఫికేషన్‌ అవసరం లేదని తెలిపారు. వారు నేరుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు. మొదటిసారి నమోదు చేసుకునే కొత్త క్రీడాకారులు మాత్రం తప్పనిసరిగా ఆధార్‌ ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు చిత్తూరులోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయం, లేదా 08572– 295619 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

బయటపడిన గణపతి ప్రతిమ

తవణంపల్లె(ఐరాల): తవణంపల్లె మండలం అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయ సమీపంలో మంగళవారం రాతి గుండుపై చెక్కబిన అతి పురాతనమైన గణపతి ప్రతిమ బయట పడింది. అర్ధగిరి ప్రదక్షిణకు సాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో వెలుగు చూసిన ప్రతిమకు స్థానికుల భక్తిప్రపత్తులతో పూజలు చేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ మరో పదిరోజుల పాటు కొనసాగనుంది. జిల్లాలో ఇప్పటికీ పలువురు ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను నింపి బీఎల్‌ఓలకు తిరిగి ఇవ్వకపోవడం, మరోవైపు డేటా ఎంట్రీలో కొద్దిపాటి పెండింగ్‌ ఉండటంతోనే కేంద్ర ఎన్నికల సంఘం సవరణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అందిన అధికారిక నివేదిక ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సవరణ డిజిటలైజేషన్‌ ప్రక్రియ 99.97 శాతానికి చేరింది.

లక్ష్యం వంద శాతం

జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 12,04,840 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలను మాత్రమే డిజిటలైజ్‌ చేయగలిగారు. అంటే కేవలం 89.90 శాతం మాత్రమే ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. మిగిలిన 10.10 శాతం ఓటర్లకు సంబంధించిన ఫారాలు ఇంకా చేరకపోవడం, ప్రాసెస్‌ కాకపోవడం గమనార్హం.అన్‌న్‌కలెక్టబుల్‌ (మరణించిన, వలస వెళ్లిన) ఓటర్ల సంఖ్యను కలిపితే మొత్తం డిజిటలైజేషన్‌ ప్రక్రియ 99.97 శాతానికి చేరుకున్నప్పటికీ.. వంద శాతం పూర్తి కావడానికి ఇంకా 396 ఓటర్ల ఫారాలు డిజిటలైజ్‌ కావాల్సి ఉంది.

కుప్పంలోనే పెండింగ్‌!

కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 391 ఫారా ల డిజిటలైజేషన్‌ పెండింగ్‌లో ఉంది. ఇక్కడ మొ త్తం డిజిటలైజేషన్‌ ప్రక్రియ 99.83 శాతం పూర్తయింది. పలమనేరు నియోజకవర్గంలో 5 ఫారాలు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో పెండింగ్‌ ఫారాల సంఖ్య సున్నాగా నమోదై, 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అన్‌కలెక్టబుల్‌ జాబితాలో

లక్ష మందికి పైగా ఓటర్లు

ప్రత్యేక సవరణ సర్వేలో జిల్లావ్యాప్తంగా మొత్తం 1,34,890 మంది ఓటర్లను (10.07 శాతం) అన్‌న్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. ఇందులో మరణించిన ఓటర్లు 41,642, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 53,754, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన వారు 17,892, గైర్హాజరైన వారు 21,513, ఇతర కేసులు 89 ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు అత్యధికంగా పలమనేరులో 15,080 మంది, మరణించిన ఓటర్లు అత్యధికంగా పలమనేరులో 8,761 మంది, పూతలపట్టులో 7,654 నియోజకవర్గాల్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

హర్షవర్ధన్‌

శ్రీనివాసులునాయుడు

తమ్ముళ్ల ఆదాయ వనరుగా ‘ఓటీఎస్‌’

పరిశీలించి.. అర్హుల జాబితా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తూ తెచ్చిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పట్టాలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు ఆదాయ వనుగా మారిపోయాయి. కేవలం రూ.10 నామమాత్రపు రుసుముతో, వందలాది మందికి ’జీరో పేమెంట్‌’ కింద రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పేదలకు పంచాల్సిన పట్టాలను పచ్చమూక మాయం చేసేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సచివాలయాల్లో భద్రంగా ఉండాల్సిన ఈ హక్కు పత్రాలను తెలుగు తమ్ముళ్లు తమ సొంత గల్లా పెట్టె లా మార్చుకోవాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల దాగుడు మూతలు

చిత్తూరు మండలంలోని 17 పంచాయతీల్లోని సచివాలయాకు గత ప్రభుత్వ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 4 వేలకు పైగా ఓటీఎస్‌ పట్టాలనుఅందజేశా రు. అయితే ప్రభుత్వం మారాక ఈ పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అప్పటి నుంచి లబ్ధిదారులు తమ హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగే లా తిరుగుతున్నారు. పంచాయతీ కార్యదర్శులను అడిగితే మా దగ్గర పట్టాలు లేవని చేతులెత్తేస్తున్నారు. గతంలని సిబ్బందిని అడిగితే మాకేమీ తెలియదు అంటూ తప్పించుకుంటున్నారు. హౌసింగ్‌ అధికారులను ఆశ్రయిస్తే..మేము ఎప్పుడో ఆ పట్టాలను సచివాలయాలకు అప్పగించేశాం.. మాకు సంబంధం లేదని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో అసలు పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

పచ్చనేతల బేరం

పట్టా కావాలంటే మాముళ్లు ఇచ్చుకోవాలని తమ్ముళ్లు హుకుం జారీ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎంత బరితెగించిందంటే.. చిత్తూరు మండలంలో ఒక పచ్చ నేత ఏకంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తనే ఏకంగా రూ. 90 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు కార్యకర్త ఆవేదన తమ పార్టీ నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నా డు. దీనిపై విచారించగా, అధికారుల పేరు చెప్పి సద రు టీడీపీ నేత తన జేబు నింపుకుంటున్నట్లు తెలిసింది.రూ.10 చెల్లిస్తే చేతికి అందాల్సిన పట్టాలను దాచేసి, వాటిని బ్లాక్‌మార్కెట్‌ చేస్తున్న పచ్చ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, పట్టాలు ఎక్కడున్నాయో తేల్చాలని, దళారుల చేతిఓని పేదల హక్కు పత్రాలను తక్షణమే లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో ప్రతి మామిడి రైతు వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలించి సబ్సిడీకి అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్‌లో ఉద్యానవన, పలు శాఖల అధికారులతో సమా వేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ మామిడి రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీని పారదర్శకంగా, నిజమైన రైతులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఈ మేరకు మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఉమ్మడి బృందాలను ఏర్పా టు చేయాలని సూచించారు.

ఈ–క్రాప్‌ డేటా తప్పనిసరి

మామిడి పంట నమోదు వివరాలను ఈ–క్రాప్‌ డేటాతో తప్పనిసరిగా సరిపోల్చాలని, కేవలం రికార్డులపైనే ఆధారపడకుండా భౌతిక పరిశీలన చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ–క్రాప్‌లో నమో దు లేకపోయినా.. క్షేత్రస్థాయిలో పంట ఉంటే, నిబంధనల ప్రకారం వారికి ఈ–క్రాప్‌ నమోదు పూర్తి చేసి అర్హత కల్పించాలన్నారు.

రైతు మరణిస్తే కుటుంబ సభ్యులకు..

ఈ–క్రాప్‌లో నమోదై ఉండి రైతు మరణించిన సందర్భంలో కుటుంబీకులకు న్యాయం చేయాలని, నిబంధనల ప్రకారం సబ్సిడీ అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. అలాగే రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి పరమేశ్వరన్‌, హార్టికల్చర్‌ అధికారి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ నెల 24 వరకు డెడ్‌లైన్‌!

ఎన్యూమరేషన్‌ ప్రక్రియలోని ఈ లోపాలను సరిదిద్దడానికి, అలాగే క్షేత్రస్థాయిలో ఇంకా ఓటర్ల నుంచి తిరిగి రాని ఫారాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇప్పటికై నా ఓటర్లు స్పందించి తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను వెంటనే అందజేయాలని, అలాగే బీఎల్‌ఓలు మిగిలిన కొద్దిపాటి పెండింగ్‌ను యుద్ధప్రాతిపదికన డిజిటలైజ్‌ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

ఒక్క నెల.. లక్షలాది మంది ఓటర్లు.. క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయాలి.. పూర్తి చేసిన వాటిని సేకరించాలి.. వివరాలను తనిఖీ చేయాలి.. అనంతరం మ్యాపింగ్‌ చేయాలి.. ఇదే లక్ష్యంతో కలెక్టర్‌ నుంచి బీఎల్‌ఓ వరకు పరుగులు తీశారు. ప్రధానంగా మంగళవారం ఆఖరి రోజున తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు. పెద్దసంఖ్యలో ఈఎఫ్‌లు తిరిగిరాలేదు. డేటా ఎంట్రీ సైతం కొద్దిపాటి పెండింగ్‌ ఉండిపోయింది. ఈ క్రమంలో ఓటర్ల సవరణ ప్రక్రియను పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జిల్లా యంత్రాగానికి కాస్త ఉపశమనం లభించింది. ఈ మేరకు ఎస్‌ఐఆర్‌ మరో పదిరోజుల పాటు కొనసాగనుంది.

భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను సవరించినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం బూత్‌ లెవల్‌ అధికారులు నిర్వహించే ఇంటింటి ఓటరు సర్వే ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ గడువుకే పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 31వ తేదీన ప్రచురిస్తారన్నారు. అనంతరం ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారని వివరించారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ సెప్టెంబర్‌ 28వ తేదీ నాటికి అధికారులు పూర్తిగా పరిష్కరిస్తారన్నారు. అన్ని సవరణల అనంతరం అక్టోబర్‌ 3వ తేదీన తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. జిల్లాలో అత్యంత పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇంటింటి సర్వేకు వచ్చే బీఎల్‌ఓలకు ఓటర్లు సరైన వివరాలను అందించి, పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement