నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ప్రారంభం

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరులో అన్ని సబ్జెక్టుల డీఆర్‌పీలకు రెండు రోజులపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ స్కూల్‌ అసిస్టెంట్‌లు నైపుణ్యాలు పెంచుకోవాలని కోరారు. శిక్షణలో జాతీయ విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, అకడమిక్‌ క్యాలెండర్‌, టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌, విద్యార్థుల మూల్యాంకన పుస్తకం, హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డ్‌, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, లీప్‌ యాప్‌ వినియోగం వంటి కీలకమైన అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ లభించిన నైపుణ్యాలతో డివిజన్‌ స్థాయిలో ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ తరగతులను విజయవంతం చేసి, విద్యా సంస్కరణల అమలుకు కృషి చేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement