ఇది తాత్కాలిక వాయిదా మాత్రమే | - | Sakshi
Sakshi News home page

ఇది తాత్కాలిక వాయిదా మాత్రమే

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

● ఫైళ్ల కింద నలిగిపోతున్న న్యాయం ● పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు దక్కని మోక్షం ● తిరిగి తిరిగి అలసిపోతున్న అర్జీదారులు ● గ్రామాల్లో వారసత్వంగా వచ్చిన భూమి గానీ, కొనుగోలు చేసిన భూమి గానీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో పేరు మార్పిడి కావడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ● ఆన్‌లైన్‌ రికార్డుల్లో విస్తీర్ణం తప్పుగా పడడం, ఒకరి భూమి మరొకరి పేరు మీద చూపించడం, ఒకే సర్వే నంబరులో విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు నమోదు కావడం వంటి సాంకేతిక లోపాల సవరణకు దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ● పొరుగు రైతులతో సరిహద్దు తగాదాలు ఉండి, ప్రభుత్వ సర్వేయర్‌ కోసం ఫీజు చెల్లించి దర ఖాస్తు చేసుకున్నా.. సర్వేయర్లు క్షేత్ర స్థాయికి రా వడం లేదు. పొరపాటున దేవదాయ, వక్ఫ్‌ ప్రభుత్వ భూముల జాబితా (22ఏ)లో చేరిన పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న తలపెట్టిన ఉద్యోగుల సన్నద్ధ సభను తాతాలికంగా వాయిదా వేశారు.
ఎరువు..బరువు
జిల్లాలో ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధర రెట్టింపయ్యింది.

మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026

వివిధ ప్రాంతాల నుంచి అర్జీలిచ్చేందుకు విచ్చేసిన ప్రజలు

23న ధర్మకర్తల

మండలి సమావేశం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 23న జరగనున్నట్లు ఆలయ ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ధర్మకర్తల మండలి సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌్‌ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు.

99 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో సర్‌ ప్రక్రియ డిజిటలైజేషన్‌ 99 శాతం పూర్తయినట్టు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు. సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి 99 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయినట్టు వివరించారు. డిజిటలైజేషన్‌న్‌ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. మిగి లిన శాతాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా లని ఆదేశించారు.

నియోజకవర్గాల వారీగా పురోగతి ఇలా...

జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు. నగరిలో 100 శాతం, జీడీ నెల్లూరులో 99.82 శాతం, పలమనేరులో 99.57, పూతలపట్టులో 99.23, చిత్తూరులో 97.96, కుప్పంలో 97.42 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు.

ఆర్‌ఎంపీ, పీఎంపీలపై

కఠిన చర్యలు

గుడిపాల: గుడిపాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన వైద్యశాఖ బృందం సోమ వారం తనిఖీలు నిర్వహించింది. ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న తుమ్మిందపాళ్యంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఎటువంటి రికార్డులు లేక వైద్యసేవందించడంపై మండి పడింది. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యసేవలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీషనర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాము నివేదికలు సిద్ధం చేసినట్టు వెల్లడించింది. ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలని సూచించింది.

న్యాయం జరగాలి

‘మేము ఎస్సీ కులానికి చెందిన పేదవారం. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వెదురుకుప్పం మండలం, దేవరగుడిపల్లి పరిధిలోని సర్వే నం.288లో 3.88 ఎకరాల భూమినిచ్చింది. కానీ, మాకు తెలియకుండానే ఓసీ కులానికి చెందిన సుందరరామయ్య అనే వ్యక్తి దౌర్జన్యంగా మా భూమిని ఆన్‌న్‌లైన్‌ చేయించుకున్నాడు. ఇప్పుడు వేణుగోపాల్‌, నందగోపాల్‌ అనే వ్యక్తులు మమ్మల్ని మా సొంత భూమిలోకి కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మాకున్న ఒకే ఒక్క జీవనాధారాన్ని లాగేసుకుంటే మేము ఎలా బతకాలి?. క్షేత్ర స్థాయిలో అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్న న్యాయం జరగడమే లేదు. మా భూమి మాకు దక్కేలా చూడాలి.

– సంతోషం, బాధితురాలు,

దేవరగుడిపల్లి, వెదురుకుప్పం మండలం

తిరిగి..తిరిగి అలసిపోతున్నా

‘నా పేరు మీద ఐరాల మండలం పి.యర్రేపల్లి గ్రామంలో ఖాతా నం.1575, సర్వే నం.1045/1డీ పరిధిలో 0.75 సెంట్ల భూమి ఉంది. చాలా సంవత్సరాలుగా నాకు క్రమం తప్పకుండా పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వచ్చేవి. కానీ, ఈ సారి హఠాత్తుగా పథకం డబ్బులు నిలిచిపోయాయి. ఎందుకని వ్యవసాయశాఖ అధికారులను అడిగితే.. నా పేరు మీద భూమి ఆన్‌న్‌లైన్‌లో చూపించడం లేదని చెప్పారు. రికార్డుల్లో స్పష్టంగా భూమి ఉన్నా, కంప్యూటర్‌ ఆన్‌లైన్‌ లోపాల వల్ల నా పేరు ఎగిరిపోయింది. రెవెన్యూ అధికారుల తప్పిదానికి నేను పథకానికి దూరం కావాల్సి వచ్చింది. కలెక్టరేట్‌కు తిరిగి తిరిగి అలసిపోతున్నా ఫలితం లేకుండా పోయింది.

– శారద, యర్రేపల్లి గ్రామం, ఐరాల మండలం.

అలసిన అర్జీ!

అర్జీదారుకి అన్యాయం జరుగుతోంది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ‘స్పందన’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌కు అత్యంత ఆదరణ లభించింది. సమస్యా..! అని కార్యాలయ మెట్లెక్కే ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేది. క్షేత్ర స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభించేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్పందన పేరు మార్చి ప్రజాసమస్యల పరిష్కార వేదిక పేరుతో ఏర్పాటు చేస్తున్న గ్రీవెన్స్‌ సెల్‌కు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అర్జీలకు పరిష్కారం లభించకుండా పోతోంది. అర్జీదారు కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్లరుగుతున్నాయి తప్ప.. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్రంగా కుంగిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత రెండేళ్లలో అర్జీ ఆవేదనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ఆన్‌లైన్‌ సక్సెస్‌ ...

గ్రౌండ్‌ లెవల్లో ఫ్లాప్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 2024 జూన్‌ 15 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పీజీఆర్‌ఎస్‌లో 77,859 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో 65,381 పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం పరిష్కారం అయిన 65,381 అర్జీల్లో 60,398 నిర్ణీత గడువులోపు పరిష్కరించగా, 4,983 అర్జీలు గడువు దాటిన తర్వాత పరిష్కరించినట్లు వెల్లడిస్తున్నారు. అయితే అధికారులు ఆన్‌లైన్‌లో పరిష్కరించేశామని క్లోజ్‌ చేసిన అర్జీలు తిరిగి మళ్లీ నమోదవుతూనే ఉన్నాయి. అలాంటి అర్జీలు దాదాపు 35 వేలకు పైగా ఉంటాయని సమాచారం.

‘పరిష్కారం’ ఆన్‌లైన్‌లోనేనా?

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం అర్జీదారుడు దరఖాస్తు ఇవ్వగానే, దానికి ఒక నంబర్‌ కేటాయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వీఆర్‌వోలు, సర్వేయర్లు ఆ ఫైళ్లను పరిశీలించి తుది నివేదిక ఇచ్చే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో ఏదో ఒక కుంటి సాకుతో అర్జీని తిరస్కరిస్తున్నారు.

అభాగ్యుల ఆవేదన అంతేనా?

రెండున్నరేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ లేదు. అభాగ్యులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. కొందరు అర్జీఇచ్చేందుకు వచ్చి గాయాలపాలవుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి.

వేధిస్తున్న భూ సమస్యలు

కాళ్లరిగేలా తిరుగుతూ..!

‘గత ఏడాది కాలంగా ఐదు సార్లు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చాను. ప్రతిసారీ విచారణ జరిపి న్యాయం చేస్తామని రశీదు ఇస్తున్నారు తప్ప, గ్రామంలోకి వచ్చి చూసే నాథుడే లేడు’ అని రమణయ్య అనే అర్జీదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు వయసు పైబడిన వారు, మరోవైపు మహిళలు తమ భూ హక్కుల కోసం రెవెన్యూ కార్యాలయాల మెట్లు దిగి ఎక్కలేక, అటు పొలం పనులూ చేసుకోలేక మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు.

విష ప్రయోగమా..

ప్రకృతి వైపరీత్యమా?

పోలీసు గ్రీవెన్స్‌కు 64 ఫిర్యాదులు

నేటి నుంచి

వృత్తి నైపుణ్య శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కూల్‌ అసిస్టెంట్లకు (అన్ని సబ్జెక్టుల డీఆర్‌పీలు) రెండు రోజుల పాటు జిల్లా స్థాయి ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శిక్షణ తరగతులు జరుగుతాయని ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న జాతీయ విద్యావిధానం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, 2026–27 అకడమిక్‌ క్యాలెండర్‌, టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌, విద్యార్థుల మూల్యాంకన పుస్తకం, హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డ్‌, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు ‘లీప్‌’ యాప్‌ వినియోగంపై శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించనున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన డీఆర్‌పీలు తదుపరి డివిజన్‌ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని చెప్పారు.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 64 అర్జీలు వచ్చినట్టు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. వీటిలో పలు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్‌ హౌస్‌ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదు ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు నాన్‌క్యాడర్‌ ఎస్పీ రాజశేఖర రాజు, ఏఎస్పీ షాను, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.

– అగరమంగళం చెరువులో

చేపల మృతిపై అనుమానాలు

గంగాధరనెల్లూరు : మండలంలోని అగరమంగళం చెరువులో సోమవారం చేపలు అకస్మాత్తుగా మృతి చెందాయి. అగర మంగళం పంచాయతీ తీర్మానం ప్రకారం గత నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన సందీప్‌ అనే యువకుడు చెరువు వేలం పాటలో రూ.20 వేలకు చేపల చెరువును దక్కించుకున్నాడు. దాదాపు రూ.1.2 లక్షలతో చేప పిల్లలను చెరువులో వదిలి, దాదాపు మూడు నెలలుగా మేపుతున్నాడు. సోమవారం ఉదయం చెరువు దగ్గర సుమారు కేజీ, అరకేజీ వరకు సైజు ఉన్న చేపలు మృతి చెంది తేలిపోయాయి. విష ప్రయోగంతో చేపలు చనిపోయాయా..? లేక మరే ఇతర కాణాలు ఏమైనా ఉన్నాయా..? అని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

అలసత్వం వద్దు ‘సర్‌’

చిత్తూరు కలెక్టరేట్‌ : సర్‌ ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల సంఘం బృంద సభ్యులు సోమవారం జిల్లాలోని చిత్తూరు, ఐరాల మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. చిత్తూరులోని దొడ్డిపల్లి, గాయత్రినగర్‌, ఐరాల మండలం, కాణిపాకం, చిన్నకంపల్లి, కొత్తపల్లి, వడ్డేరామాపల్లి పోలింగ్‌ కేంద్రాల్లో సర్‌ ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి అర్హుడు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఇంటింటా సర్వేను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయలక్ష్మి, చిత్తూరు నగరపాకల కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ పాల్గొన్నారు.

‘ఖాకీ’ల ఆశలు.. అడియాశలు!

పీజీఆర్‌ఎస్‌ అర్జీల సమాచారం

(2024 జూన్‌ 15 నుంచి

2026 జూలై 13 వరకు)

నియోజకవర్గం నమోదైన పున:పరిశీలనకు

అర్జీలు వచ్చినవి

కుప్పం 21,290 1200

గంగాధరనెల్లూరు 14927 1458

పలమనేరు 14254 1233

పూతలపట్టు 11798 902

చిత్తూరు 8698 1161

నగరి 4321 586

పుంగనూరు 2571 181

మొత్తం 77,859 6,721

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement