చిత్తూరు కలెక్టరేట్ : 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 53 జారీ చేయడంపై ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 అమలుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లలో ఎంపికై , సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకే ఒక్క సారి ఓపీఎస్‌ను ఎంచుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించిందన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల సుదీర్ఘ కల సాకారమైందని తెలిపారు.
వినాయకుడి సేవలో
కేంద్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి
కాణిపాకం: కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారిని కేంద్ర ఎలక్షన్ కమిష నర్ కార్యదర్శి నవీన్‌కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈఓ పెంచలకిషోర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించు కున్న నవీన్‌కుమార్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఈఓ శేషవస్త్రం, స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశా రు. దర్శనానంతరం దేవస్థానం అతిథి గృహానికి చేరుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శికు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు పూలమొక్కను అందజేశారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
రాయలసీమ బలిజలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
నగరి : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రాయలసీమ బలిజలకు అవకాశం కల్పించాలని రాయలసీమ బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని జాతీయ కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కాపు సంఘ కార్యాలయం వద్ద జాతీయ కాపు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఎంవి.బాబు, ప్రచార కార్య దర్శి గోపీరాయల్, సీనియర్ నాయకుడు జ్యోతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘ నేతలు తమ డిమాండ్‌ను కూటమి ప్రభుత్వం ముందు ఉంచారు. గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానా న్ని రాయలసీమ బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. సమావేశంలో కాపునాయకులు శేఖర్, వాసు, గోపి, సౌందర్‌రాజన్, అయ్య ప్ప, కదిర్‌వేలు, మణి పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుత్తూరు: స్థానిక పున్నమి సర్కిల్ సమీపంలోని మహాలక్ష్మీపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియన వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ బి.వెంకటలక్ష్మి కథనం.. సుమారు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మహాలక్ష్మీపురం వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నె వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు,నలుపు గీత ల గళ్లు కలిగిన ఫుల్ షర్టు, బిస్కెట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. కుడి చేతిపై చంద్రశేఖర్ అని పచ్చబొట్టు ఉంది. ఈ మేరకు పుత్తూరు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాది జైలు
చిత్తూరు అర్బన్: కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో ముద్దాయి వై.సీమాన్ సుదర్శన్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అద నపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయ స్థానం సోమవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. చిత్తూరు నగరం భరత్‌నగర్ కాలనీకి చెందిన మౌనిక అనే మహిళకు, తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన వై.సీమాన్ సుదర్శన్‌తో పెళ్లయ్యింది. అయితే పెళ్లయ్యిన కొద్ది నెలలకే తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని 2020లో చిత్తూరులోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. దీనిపై ఎస్‌ఐ కె.నిత్యానంద పిళ్లై కేసు నమోదుచేసి, దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. సుదర్శన్‌పై సాక్ష్యాధా రాలతో సహా కోర్టులో కేసు రుజువయ్యింది. మిగిలిన వాళ్లపై న్యాయస్థానం కేసు కొట్టేసింది. ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఏఎస్‌ఐ పరంధామనాయుడు, మహిళా ఎస్‌ఐ కరీమున్నిసా, అప్పటి ఎస్‌ఐ నిత్యానంద పిళ్లైని ఎస్పీ అభినందించారు.


