శాంతిపురం: సరిహద్దుల్లోని కర్ణాటక భూ భాగంలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. కర్ణాటకలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరవనహళ్లి సమీపంలో వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడు కావచ్చనే సందేహంతో వారు సమాచారం ఇచ్చారని చెప్పారు. మృతుడి ఆనవాళ్లను గుర్తుపట్టిన వారు 9480802753 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు


