చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రతి రైతుకూ ఎరువులు అందాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకూ సకాలంలో ఎరువులు, యూరియా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంటల అవసరాలకు అనుగుణంగానే యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. రైతులు తమ కోటాను ఎప్పుడైనా పొందే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. అయితే, ఒక చోట కోటా తీసుకున్న వారు మరోచోట తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. కొందరు రైతులు అవసరం లేకపోయినా, పక్కవారు కొంటున్నారనే కారణంతో అనవసరంగా యూరియాను నిల్వ చేసుకుంటున్నారన్నారు. అనర్హులు ఎవరూ యూరియా తీసుకోరాదని హెచ్చరించారు.
సవరణలకు అవకాశం
ఈ–పంట నమోదులో ఏవైనా లోపాలు ఉంటే, రైతులు వెంటనే సంబంధిత రైతు భరో సా కేంద్రానికి వెళ్లి ‘ఎడిట్’ ఆప్షన్ ద్వారా సవరణలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు లేని, లేదా భూవివాదాలు ఉన్న రైతులు ఈ–పంట నమోదు చేసుకోలేరని తెలిపారు.
ఏపీఏఐఎంఎస్ యాప్‌ను
డౌన్‌్‌లోడ్ చేసుకోండి
రైతులు తమ సొంత మొబైల్‌లలో ఏపీఏఐఎంఎస్ యాప్ ఇన్‌న్‌స్టాల్ చేసుకోవాలని తెలిపారు. ఈ యాప్ లో వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలతో పాటు, ఎండా కాలంలో పంట ఫొటోను అప్‌లోడ్ చేస్తే పంట స్థితిగతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చని వివరించారు.
బ్లాక్ మార్కెట్‌పై ప్రత్యేక నిఘా
ఈ సీజన్‌లో జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్ను ల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా 7 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వారం వారం ఎరువుల అవసరాల నివేదికలను పక్కాగా రికార్డు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సెప్టెంబర్‌లో యూరియా డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్న రైతులకు సైతం ఎరువులు సకాలంలో అందేలా చూ డాలన్నారు. యూరియా పంపిణీని పూర్తి గా ఓటీపీ ఆధారంగానే చేపట్టాలన్నారు. ఓటీపీ రాని పక్షంలో బయోమెట్రిక్ విధా నాన్ని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ డీలర్లు ఎవరైనా యూరియాతో పాటు ఇతర లింక్డ్ ఇన్పుట్స్ (ఇతర మందులు) బలవంతంగా అమ్మితే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.


