చిత్తూరు కలెక్టరేట్ : ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి క్షేత్రస్థాయిలో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. సాంకేతిక చిక్కుల పేరుతో పథకం లబ్ధిని ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పథకానికి ప్రస్తుత ఏడాదిలో సాంకేతిక సాకులతో అధికంగా విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర అధికారులు విధించిన గడువు సమీపి స్తున్నా జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల్లో సగానికి పైగా వారి పేరు మీద ఇంకా బ్యాంక్ ఖాతాలు తెరవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున తల్లికి వందనం సొమ్ము జమ చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే విద్యార్థుల పేరు మీద ఖాతాలు లేకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది.
గణాంకాల్లో అసలు పరిస్థితి
జిల్లాలో పదో తరగతి పూర్తిచేసుకుని ఇంటర్‌లో చేరిన మొత్తం ఎస్సీ విద్యార్థులు 12,458 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 10 శాతం మంది కూడా ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలు తెరవని దుస్థితి. బ్యాంకు ఖాతాలు తెరిచిన విద్యార్థుల్లో సైతం చాలామంది ఎన్‌పీసీఐతో కూడిన లింక్‌తో ఖాతాలు తెరవలేదని తెలిసింది. ఈ సాంకేతిక సాకుతో వేలాది మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ఎగ్గొట్టేందుకు కూటమి సర్కారు స్కెచ్ వేసింది.
పోస్టాఫీసుల్లో ఖాతాలు
ఖాతా సొమ్ము జమ కాకపోతే ఆ ప్రభావం నేరుగా పే ద విద్యార్థుల ఇంటర్ చదువులపై పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 40 శాతం, రాష్ట్ర ప్రభు త్వం నుంచి 60 శాతం నిధులు లభిస్తాయి. విద్యార్థుల పేరుతో యాక్టివ్ ఖాతా ఉంటేనే కేంద్రం నుంచి వచ్చే వాటా నేరుగా జమ అవుతుంది. సాధారణ జాతీయ బ్యాంకుల్లో ఖాతా తెరిస్తే ఎన్‌పీసీఐ అనుసంధానానికి కొంత ఆలస్యం అవుతుంది. అదే పోస్టాఫీసులో (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) ఖాతా తెరిస్తే కేవలం 24 గంటల్లోనే ఎన్‌పీసీఐ అనుసంధానం పూర్తవుతుందని అధికారులు సూచిస్తున్నారు.
పాన్ కార్డు మినహాయింపు
పోస్టాఫీసుల్లో ఇప్పటిదాకా కచ్చితంగా పాన్ కార్డు ఉంటేనే ఖాతా తెరవడానికి అవకాశం ఉండేది. కానీ ప్రస్తు త అత్యవసర పరిస్థితి దృష్ట్యా పాన్ కార్డు లేకున్నా.. విద్యార్థి ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబి తా, రూ. 200 ఉంటే చాలు వెంటనే ఖాతా తెరుస్తున్నా రు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ఈ ఖాతా ప్రా రంభిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.


