తిరుపతి అర్బన్: తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థల ఆవరణలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సంబందించి ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించన్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథరెడ్డి శనివారం తెలిపారు. 2027 నవోదయ ప్రవేశ పరీక్షలో కీలకమార్పులు చేశారని వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, భాషా పరీక్షలతోపాటు పర్యావరణ అధ్యాయనం అనే అంశాన్ని పరీక్షలో చేర్చినట్లు వివరించారు. కొత్త పరీక్షా విధానం, సిలబస్, ప్రశ్నపత్రం నమూనా, మార్కుల విభజన, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం తదితర అంశాలపై నిపుణులచే సమగ్రంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉందని వెల్లడించారు. అవగాహన సదస్సుకు ఎలాంటి రుసుం లేదని స్పష్టం చేశారు. వివరాలకు 8688888802, 8688888803, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
డిజిటలైజేషన్
100 శాతం పూర్తి చేయాలి
గంగాధర నెల్లూరు: ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల ను తిరిగి స్వీకరించి డిజిటలైజేషన్ కార్యక్రమా న్ని వంద శాతం పూర్తి చేయాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన శనివారం గంగాధర నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల నుంచి బీఎల్వోలు స్వీకరించి న ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. మండలంలో ఇప్పటివరకు 84 శాతం పూర్తయిందని, మిగిలినవి కూడా పూర్తి చేయా లని ఆదేశించారు. ఈఆర్వో మధుసూదన్, తహసీల్దార్ సీకే శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మోహన్,బీఎల్వోలు పాల్గొన్నారు.


