మామిడి అన్‌లోడింగ్‌కు నాలుగు రోజులు | - | Sakshi
Sakshi News home page

మామిడి అన్‌లోడింగ్‌కు నాలుగు రోజులు

Jul 12 2026 1:53 AM | Updated on Jul 12 2026 1:53 AM

గుడిపాల: మామిడికాయల అన్‌లోడింగ్‌కు నాలుగు రోజులు పడుతోంది. గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద మూడు ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఒక ప్లాంట్‌లో యంత్రాలు మరమ్మతులకు గురికావడంతో యాజమాన్యం నిలిపివేసింది. దీంతో రెండు ప్లాంట్లు మాత్రం నడుస్తున్నాయి. ర్యాంపులన్నీ మామిడికాయలతో నిండిపోయాయి. ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు బారులు తీరాయి. కాయల అన్‌లోడింగ్‌కు నాలుగురోజులు పడుతోందని ట్రాక్టర్‌ డ్రైవర్లు తెలిపారు.

పోక్సో కేసు నమోదు

పలమనేరు: మండలంలోని టి. వడ్డూరు గ్రామా నికి చెందిన మైనర్‌ బాలిక అదృశ్యం కేసులో మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన భుజేంద్ర అనే యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ మోహన్‌రెడ్డి శనివారం తెలిపారు. మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి తనతోపాటు తీసుకెళ్లినట్టు తెలిసిందని దీంతో కేసు నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

రాజీతో కేసుల పరిష్కారం సులభం

– లోక్‌ అదాలత్‌లో 12,829 కేసులు పరిష్కారం

చిత్తూరు అర్బన్‌: దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి రాజీ మార్గమమే మంచిదని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. శనివారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించారు. జిల్లా జడ్జి మా ట్లాడుతూ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల పై అప్పీల్‌కు వెళ్లడానికి కూడా వీలుండదన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న పలువురికి అవార్డు పత్రాలను అందచేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

12,829 కేసులు

కాగా పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 12,829 కేసులు పరిష్కరించారు. వీటిలో 167 సివిల్‌, 12,565 క్రిమినల్‌, 97 ప్రీలిటిగేషన్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement