– నలుగురి అరెస్టు
కుప్పం: గంజాయి అక్రమణ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీస్పీ పార్థసారధి తెలిపారు. శ్రుకవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రానికి చెందిన అలోక్ డిగాల్, సాయి డిగాల్‌తో పాటు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి చెందినా మౌలా, ప్రదీప్ 6 కేజీ గంజాయిని కుప్పం నుంచి తమిళనాడు తరలిస్తున్నారు. దీనిపై పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టడంతో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తనఖీ చేయగా గంజాయి బయటపడినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురికి అరెస్టు చేసి వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, పోలీసులు సిబ్బంది బాబు, రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు.


