గువ్వకల్లులో క్షుద్రపూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

గువ్వకల్లులో క్షుద్రపూజల కలకలం

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలం గువ్వకల్లు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి స్థానిక శివాలయానికి ఎదురుగా, నడిరోడ్డుపై బొమ్మను ఉంచి వింత పూజలు చేశారు. గురువారం ఉదయం రోడ్డుపై నిమ్మకాయలు, కోడి బలి ఇచ్చిన ఆనవాళ్లతో పాటు చిన్నపిల్లల చేతి ముద్రలు కనిపించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని గర్భిణులు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది చేతబడా లేక ఆకతాయిల పని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement