అగోడ యాప్‌.. అడ్డగోలు దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

అగోడ యాప్‌.. అడ్డగోలు దోపిడీ!

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

రూ.వెయ్యి నుంచి రూ.1,800 ఉండే గదులు రూ.18 వేలు

మరికొన్ని గదులు రూ.20,700కు ఆఫర్‌

నో స్మోకింగ్‌ రూమ్స్‌ పేరుతో కూడా ఆన్‌లైన్‌లో ప్రకటనలు

టీటీడీ మాజీ చైర్మన్‌

భూమన కరుణాకరరెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ వసతి గదుల వ్యవహా రంలో భారీ అక్రమాలు బయటపడ్డాయని వైఎస్సార్‌సీ పీ నేత,టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి వెల్ల డించారు. ఆయన బుధవారం తిరుపతి వైఎస్సార్‌సీపీ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీటీడీ వసతి గదుల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి సీసీ టీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

అగోడ యాప్‌లో తిరుమల గదుల విక్రయం జరుగుతోంది. టీటీడీ భద్రత, విజిలెన్స్‌ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండాపోయింది. టీటీడీ వసతి గదులకు సంబంధించిన తీవ్రమైన లోపాలు ఉన్నాయి. భద్రతా వ్యవస్థతో పాటు విజిలెన్స్‌ విభాగం కూడా పూర్తిగా విఫలమైంది.

అంతర్జాతీయ యాప్‌లో టీటీడీ గదుల విక్రయం!

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక, హోటల్‌ బుకింగ్‌ సేవ లు అందించే అగోడ యాప్‌లో టీటీడీకి చెందిన వసతి గదులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. టీటీడీ నిబంధన ల ప్రకారం భక్తులకు కేటాయించాల్సిన గదులు ప్రైవే టు బుకింగ్‌ వేదికలో ఎలా దర్శనమిస్తున్నాయో ప్రభుత్వం, టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. టీటీడీకి చెందిన ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వికాస్‌ నిలయం, వకుళమాత అతిథి గృహం వంటి పేర్లతో గదు లు యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు కనిపించాయి.

నవనీతమ్మ వ్యవహారం ఏమైంది?

ఇటీవల నవనీతమ్మకు సంబంధించిన దర్శన వ్యవహారంపై సీఎం, టీటీడీ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో ప్రకటనలు చేశారు. ఆమె పాదయాత్ర చేయలేదని ఏ ఆధారాలతో నిర్ధారించారో ప్రజలకు వెల్లడించాలి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు, టీటీడీ చైర్మన్‌ చెప్పిన వివరాలకు మధ్య భిన్నత్వం ఉంది. నవనీతమ్మ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను ప్రజల ముందుంచాలి.

నకిలీ వెబ్‌సైట్లపై చర్యలు ఎక్కడ?

భక్తులు నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ బుకింగ్‌ యాప్‌ల ద్వారా మోసపోతుంటే వాటిని అరికట్టేందుకు టీటీడీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. నవనీతమ్మ అంశంపై చూపిన చొరవను నకిలీ యాప్‌లు, నకిలీ బుకింగ్‌ వ్యవస్థల నియంత్రణపై కూడా చూపాలి. మా హయాంలో టీటీడీకి సంబంధించిన 48 నకిలీ వెబ్‌సైట్లపై ఫిర్యాదులు చేసి వాటిని మూసివేయించాం.. అని భూమన పేర్కొన్నారు.

రూ.1,000 గది రూ.18 వేలకా?

టీటీడీ నిర్ణయించిన అద్దె ప్రకారం రూ.వెయ్యి నుంచి రూ.1,800 మధ్య ఉండే గదులను ఆన్‌లైన్‌లో రూ.14,500, రూ.18,180, రూ.20,700 వరకు విక్రయానికి ఉంచినట్లు కనిపించింది. అధిక ధరలకు గదులు విక్రయించే ప్రయత్నం జరుగుతోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, ‘నో స్మోకింగ్‌ రూమ్స్‌’ పేరుతో కూడా కొన్ని గదులు ప్రచారంలో ఉన్నాయి. ఇది టీటీడీ అధికారిక బుకింగ్‌ విధానానికి ఏమాత్రం సరిపోదు.

టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ అక్రమాలు

ఆ విభాగాలు ఏం చేస్తున్నాయి?

కోట్లాది మంది వినియోగించే యాప్‌లో టీటీడీ వస తులు కనిపిస్తుంటే, వాటిని గుర్తించడంలో టీటీడీ భద్రతా విభాగం, విజిలెన్స్‌ వ్యవస్థ పూర్తిగా విఫల మైంది. భక్తులను నకిలీ బుకింగ్‌లు, మోసాల నుంచి కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement