తిరుపతి మంగళం : మావిగన్ ద్వారా విజయవాడ అమరావతితో పాటు మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని వైస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తిరుపతిలో మీడియతో మాట్లాడారు. చంద్రబాబు రాజధాని పేరు చెప్పుకుని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాజధాని పేరు చెప్పి రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ 50 వేల ఎకరా లు సేకరించాలని చూస్తున్నారంటే రియల్ దందా కాక మరేముందని ప్రశ్నించారు. అమరావతి పేరు చెప్పి రూ.వేల కోట్లు అప్పు చేసి, కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులంతా నీళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్ పేరు చెబితే చంద్రబాబు, ఆయన బినామీల గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. మావిగన్‌పై తమ పార్టీ సీనియర్ నాయకు ల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం పూర్తిగా నిరాధారమన్నారు. మావిగన్ తీసుకొస్తే తమ పార్టీ నుంచి మారే వాళ్లెవ్వరూ లేరన్నారు. వైఎస్సార్ సీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
కుప్పంలో ఓట్లు మారితే చర్యలు
సర్ ఓటరు సర్వే చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు బాగానే జరుగుతోందని, కుప్పంలో ఏమైనా ఓట్లు మార్పులు వంటివి ఉంటే వాటిపైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. రావణ్ అనే వ్యక్తి తమ పార్టీకి చెందిన వాడు కాదన్నారు. ఆయన ప్రశ్నించింది పవన్‌కళ్యాణ్‌ను అని, ఆయన్ను ఏ విధంగా ఇక్కడి తీసుకొచ్చి మాట్లాడిచ్చారో కూటమి నాయకులు చెప్పాలన్నారు. సాయికృష్ణను లాకప్‌లో చంపేసి అతని తల్లికి బూడిద కూడా దొరక్కుండా చేయడం రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం కోసం చేసిందేమీలేదన్నారు.


