బంగారుపాళెం : మండలంలోని కరిడివారిపల్లెకు చెందిన జనసేన కార్యకర్తలు యువాన్, అజిత్, అవినాష్, చంటి, రాహుల్, వినయ్ తదితరులు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికిఆ పార్టీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


