గుడిపాల: మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ రామ్మోహన్ కథనం మేరకు.. లారీ బియ్యం లోడుతో మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి వెళుతోంది. మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం వేలూరు వైపు వెళ్లేందుకు బ్రిడ్జి కింద తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ సచిన్ (33), క్లీనర్ రాజేష్(30) తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


