ఫోన్‌ చేస్తే ఇంటికే బీఎల్వో | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేస్తే ఇంటికే బీఎల్వో

Jul 7 2026 11:51 PM | Updated on Jul 7 2026 11:51 PM

● అభివృద్ధిలో చెరగని సంతకం ● రచ్చబండకు వస్తూ దివికేగిన రాజసం ● నేడు వైఎస్సార్‌ జయంతి

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

చిత్తూరులో చంద్రబాబు మూయించిన ఘగర్‌ ఫ్యాక్టరీని 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి పునఃప్రారంభించారు. రైతులకు అండగా నిలిచారు.

పలమనేరు నియోజకవర్గంలో కాలువపల్లె వద్ద కౌండిన్య నదిపై రూ.52 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మించారు. తదనంతర కాలంలో ఆ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ జలాశయం అని పేరు పెట్టా రు. అలాగే రూ.210 కోట్లతో పలమనేరును అభివృద్ధి పథంలో నడిపించారు. మున్సిపల్‌ కార్యాలయ భవనానికి రూ.కోటి మంజూరు చేశారు. హంద్రీ–నీవా పథకంలో భాగంగా గంగవరం మండలంలో 4 కి.మీ కాలువ కోసం రూ.20 కోట్లు కేటాయించారు. గండ్రాజుపల్లెలో 632 ఎకరాల్లో రూ.16 కోట్లతో సెజ్‌ నిర్మాణం చేపట్టారు.

కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శాంతిపురంలో ఐటీఐ భవనాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. పాలారు ప్రాజెక్టు రూపకల్పన చేసి రూ.55 కోట్లతో పనుల ప్రారంభించారు. దీనిపై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి ప్రాజెక్టును అడ్డుకున్నారు. విపక్షనేతగా 1999లో ఉచిత విద్యుత్‌ హామీని కుప్పంలోనే ఇచ్చారు. అప్పట్లోనే రుణమాఫీ ద్వారా కుప్పం రైతులకు రూ.60.24 కోట్లు లబ్ధి చేకూర్చరు. రూ.69.03 కోట్లతో విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. కుప్పం నియోజకవర్గంలో పేదలకు 36 వేల పక్కా ఇళ్లను మంజూరు చేశారు. దాదాపు వేల మందికి కొత్త ఫించన్లు అందించారు.

జీడీనెల్లూరు మండలం, వేపంజేరిలో మహదేవ మంగళం వద్ద 400 కేవీ సామర్థ్యం కలిగిన భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇక్కడ నుంచి జీడీనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలతో పాటు, కలికిరి, పలమనేరు, తమిళనాడులోని తిరువళ్లంకు కూడా సరఫరా అందిస్తున్నారు. కార్వేటినగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టారు.

గుడిపాల మండలం చీలాపల్లె, బొమ్మసముద్రంలో సీఎంసీ ఆస్పత్రి కోసం దాదాపు 640 ఏకరాలు మంజూరు చేసి అనుమతులు ఇచ్చారు.

ఓటర్ల సవరణలో ఎదురవుతున్న సమస్యలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. బీఎల్వో ఇంటికి వచ్చేవిధంగా చర్యలు చేపట్టింది.
పశువైద్యం..బహుదూరం!
జిల్లాలో పశువైద్యం అటకెక్కింది. వైద్యశాలల్లో మందుల కొరత కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు.

బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026

రాజువయ్యా..

గాలేరు–నగరి కాలువ

మా రాజువయ్యా!

చిత్తూరుతో వైఎస్సార్‌కు విడదీయరాని బంధం

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరుతో దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని పరవళ్లు తొక్కించిన ఆ మహామనిషి రూపం ఇంకా మదిలో మొదలాడుతూనే ఉంది. ఎందరో పేదలకు ప్రాణభిక్ష పెట్టిన ఆ పరబ్రహ్మని గుర్తుకు తెస్తూనే ఉంటుంది. ఉచిత విద్యుత్‌తో రైతు వెన్నుతట్టి ప్రోత్సహించిన రైతు బాంధవుడిని కర్షక లోకం స్మరిస్తూనే ఉంటుంది. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చిత్తూరులోని అనుప్పల్లెలో ఏర్పాటు చేసిన రచ్చబండకు వస్తూ 2009 సెప్టెంబర్‌ 2న అనంతలోకాలకు వేగిన ఆ మహానీయుడి ని జ్ఞప్తికి తెస్తూనే ఉంటుంది. బుధవా రం ఆయన 77వ జయంతి సందర్భంగా జిల్లాకు చేసిన అభివృద్ధిని స్థానికులు మరోసారి మననం చేసుకుంటున్నారు.

గాలేరు..నగరి

గాలేరు..నగరి సుజల స్రవంతి పథకానికి 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా జిల్లాలోని 1,03,500 ఎకరా లకు సాగునీటి తో పాటు, దాహార్తి తీర్చడానికి రూపకల్పన చేశా రు. మల్లెమడుగు డ్యామ్‌, బాలాజీ రిజర్వాయర్‌, పద్మసాగర్‌, శ్రీనివాససాగర్‌, వేణుగోపాలసాగర్‌లను కృష్ణా జలాలతో నింపేలా చర్యలు చేపట్టారు.

రూ.14 కోట్లతో ఈటీపీ ప్లాంట్‌

చేనేత పరిశ్రమలో నూలుకు రంగువేసే ప్రక్రియలో భాగంగా వినియోగించే రసాయనాల కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతుండేవి. నాటి సీఎం వైఎస్సార్‌ రసాయన నీటిని శుభ్రపరిచే కామన్‌ ఈటీపీ ప్లాంట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమేగాక రూ.14 కోట్లు మంజూరు చేశారు.

వంద పడకల ఆస్పత్రి

నగరికి రూ.15 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరైంది. ఈ ఆస్పత్రి వైఎస్సార్‌ మరణానంతరం 60 పడకలకే పరిమితమైంది. గత పాలనలో ఆస్పత్రి అభివృద్ధికి నాడు–నేడు పథకంలో రూ.5 కోట్లు మంజూరు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తన చారిటబుల్‌ ట్రస్టుద్వారా అదనపు పడకలు, వైద్య సామగ్రి, కుర్చీలు అందజేశారు.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

నగరి తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడానికి మున్సిపల్‌ పరిధి సత్రవాడ శివారుల్లో రూ.36 కోట్ల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించారు. గాలేరు–నగరిని ట్యాంకుకు అనుసంధానం చేశారు. చిత్తూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్లొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వైఎస్సార్‌ ఇక్కడికి చేరుకోకనే దివికేగారు. ఆ రోజు ఉదయం 10.45 గంటలకు అన్పుపల్లె చేరుకోవాల్సి ఉంది. కానీ మార్గ మధ్యంలో 2009 సెప్టెంబర్‌ 2న హెలిఫ్టర్‌ ప్రమాదంలో తనువు చాలించారు.

కారణ జన్ముడు వైఎస్సార్‌

రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు ఈ నెల 15లోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. పదేళ్ల సర్వీస్‌ ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు సమానమైన కేటగిరి ఉన్న వారు అర్హులన్నారు. ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలను రెండు కాపీలను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు అందజేయాలని, గడువు తర్వాత వాటిని స్వీకరించరని స్పష్టంచేశారు.

తెలుగు దనానికి కొత్త వెలుగువు నువ్వు

నవ శకానికి నిండైన రూపం నువ్వు

నిరుపేదల ఆపన్న హస్తం నువ్వు

అభాగ్యులకు ఆయువు పోసిన ఆరోగ్య బాంధవుడివి నువ్వు

అక్కచెల్లెమ్మలకు పెద్దన్నవు నువ్వు

అవ్వాతాతల గుండె చప్పుడు నువ్వు

యువతరానికి కొత్త ఒరవడినిచ్చిన మహరాజువు నువ్వు

కర్షక లోకానికి ఆత్మబంధువు నువ్వు

పచ్చని పైరుపై చివురులు తొడిగిన చిరునవ్వువి నువ్వు

కరువు నేలపై గలగలపారే జలప్రదాతవి నువ్వు

తన మన తేడా తెలియని మనసున్న మారాజువి నువ్వు

రాజశేఖరుడువి నువ్వు..ఎన్నటికీ చెరగదు నీ చిరునవ్వు

జోహార్‌ వైఎస్సార్‌..రాజన్నా..నిన్ను మరువలేమన్నా!!

చిత్తూరు జిల్లాలో ‘రాజ’న్న ముద్ర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement