చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం నిర్వహించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో 110 విద్యుత్ సమస్యలను సిబ్బంది గుర్తించారు. అందులో 80 సమస్య లు పరిష్కారించిన ట్టు వారు వెల్లడించారు.
మాతాశిశు మరణాలపై సమీక్ష
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇటీవల జరిగిన మూడు మాతృ మరణాలు, ఐదు శిశు మరణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గర్భస్థ సమయం నుంచే రెగ్యులర్ చెకప్‌లు, పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనతను నివారించి, మాతా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. మూఢనమ్మకాలు, ముహూర్తాల కోసం ప్రసవాలు చేయడం సరికాదన్నారు. ప్రతి హైరిస్క్ గర్భిణీని సకాలంలో గుర్తించి, సీ్త్ర వ్యాధి నిపుణులతో తనిఖీలు చేయించడంతో పాటు పర్యవేక్షణ సిబ్బందితో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి, వైద్యులు, ఏఎనన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సోషల్ మీడియా
దుర్వినియోగంపై కఠిన చర్యలు
చిత్తూరు అర్బన్: సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్, కామెంట్, షేర్‌కు సంబంధించి డిజిటల్ ఆధారాలు శాశ్వతంగా నమోదవుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారి పై రాజీలేకుండా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఈ ఏడాది జిల్లాలో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన 10 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫేక్ అకౌంట్లు, తప్పుడు ప్రచారానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.


