ఐరాల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పొ లకలలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమారేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ 2002 ఓటర్ల లిస్ట్‌లో తమ తల్లి, తండ్రి పేరు సీరియల్ నంబర్ తెలుసుకోవాలన్నారు. తెలుసుకోని పక్షంలో మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు. 2002 సర్ ఓటరు లిస్ట్‌లో పేరు ఉండి, అదేవిధంగా 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ప్ మ్యాపింగ్ చేయించుకుంటే మంచిదన్నారు. అలాంటివారు బీఎల్‌ఓలు వద్ద కు వెళ్లి సెల్ప్ మ్యాపింగ్ అని చెప్పాలన్నారు. 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ప్ మ్యాపింగ్ చేయించుకోవాలని తెలిపారు. 2002లో ఓటు హక్కు, వయసు, పేరు లేకపోయినా 2025 ఓటర లిస్టులో పేరున్నవారికి మ్యాపింగ్ వర్తిస్తుందన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్లు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.


