– ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు మీ ఇంటికి రాలేదా?. ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా?. సందేహాల నివృత్తికి సచివాలయాల చుట్టూ తిరిగినా బీఎల్వోలు అందుబాటులో లేరా? అయితే మీకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫోన్ చేస్తే చాలు సిబ్బందే నేరుగా మీ వద్దకు వచ్చేలా ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌ఓ’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది.
సేవలు ఇలా..
ఓటర్లు ముందుగా ప్లేస్టోర్ నుంచి ‘ఈసీఐఎన్‌ఈటీ’ (ఈసీఐనెట్) యాప్‌ను డౌన్‌్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో ఓటరు రిజిస్ట్రేషన్ ఫారమ్స్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్‌ఎస్‌ఆర్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్, సబ్‌మిట్ ఎ కంప్లైంట్, ట్రాక్ యువర్ అప్లికేషన్ వంటి పలు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. యాప్‌లో ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌ఓ’ పై నొక్కగానే ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య అడుగుతుంది. ఒకవేళ గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే.. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, పోలింగ్ బూత్ వివరాలు నమోదు చేయగానే బీఎల్వో పేరు, ఇతర వివరాలు స్క్రీనన్‌్ పై వస్తాయి. అందులో మళ్లీ ఓటరు పేరు, రిజిస్టర్డ్ ఫోన్ నంబరు ఇవ్వాలి. ఆ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే..48 గంటల్లోగా బీఎల్వో నేరుగా మిమ్మల్ని సంప్రదించి, మీ సందేహాలను నివృత్తి చేస్తారు.


